Healthhealth tips in telugu

చలికాలంలో వారంలో 2 సార్లు ఈ సూప్ తాగితే చాలు.. రోగాలన్నీ పరార్!

Erra kandi pappu soup : వాతావరణం మారే కొద్దీ మన శరీరంలో రోగనిరోధక శక్తి (Immunity) తగ్గుతూ ఉంటుంది. ముఖ్యంగా చలికాలం లేదా వర్షాకాలంలో జలుబు, దగ్గు, ఒళ్ళు నొప్పులు వంటి సమస్యలు ఎక్కువగా వేధిస్తుంటాయి. ఇలాంటి సమయంలో మన వంటగదిలో దొరికే ఎర్ర కందిపప్పు (Masoor Dal) తో చేసే వేడివేడి సూప్ తాగితే ఆరోగ్యానికి ఊహించని ప్రయోజనాలు కలుగుతాయి.

వారంలో కనీసం రెండు సార్లు ఈ ఎర్ర కందిపప్పు సూప్ తాగడం వల్ల కలిగే అద్భుతమైన లాభాలు ఏంటో ఇప్పుడు చూద్దాం:

ఈ కాలంలో ఉదయం సమయంలో సూప్ తాగితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. ఈ సీజన్లో శరీరంలో రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నప్పుడు దగ్గు, జలుబు, డెంగ్యూ, టైఫాయిడ్ వంటి వ్యాధులు వస్తూ ఉంటాయి.
masoor dal
రోగనిరోధక వ్యవస్థ బలంగా ఉంటే ఎటువంటి ఇన్ఫెక్షన్స్ రావు. అందువల్ల రోగనిరోధక వ్యవస్థ బలంగా ఉండటం కోసం ఉదయం సమయంలో సూప్ తాగితే చాలా మంచి ప్రయోజనాలు కనబడతాయి. దీని కోసం ఒక బౌల్ లో చిన్న కప్పు ఎర్ర కందిపప్పు వేసి శుభ్రంగా కడిగి నీటిని పోసి ఐదు గంటల పాటు నాన్న పెట్టాలి.

ఆ తర్వాత క్యారెట్, టమాటాలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. నానబెట్టిన కందిపప్పులో క్యారెట్, టమాటా ముక్కలు, పావు స్పూన్ పసుపు రెండు గ్లాసుల వాటర్ పోసుకుని పాన్ లో పెట్టి ఉడికించాలి. ఉడికించుకున్న పదార్థాలను నీటితో సహా మిక్సీ జార్ లో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.

ఈ మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. దానిలో ఒక కప్పు నీరు, రుచికి సరిపడా ఉప్పు, అర స్పూన్ మిరియాల పొడి వేసి పది. నిమిషాల పాటు మరిగిస్తే వేడి వేడిగా ఎర్ర కందిపప్పు సూప్ రెడీ అవుతుంది. వారంలో రెండు లేదా మూడుసార్లు ఉదయం సమయంలో తీసుకుంటే శరీరంలో రోగనిరోధక వ్యవస్థ బలోపేతం అయి సీజనల్ గా వచ్చే వ్యాధులు ఏమీ రాకుండా ఉంటాయి.

అలాగే అధిక బరువు సమస్య నుంచి బయటపడవచ్చు. డయాబెటిస్ ఉన్న వారిలో రక్తంలో చక్కర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. రక్తహీనత సమస్య కూడా తగ్గుతుంది. కాస్త ఓపికగా ఈ సూప్ చేసుకొని తాగితే మంచిది. చిన్న పిల్లల నుండి పెద్దవారి వరకు అందరూ తాగవచ్చు. శరీరానికి అవసరమైన పోషకాలు అందుతాయి.

గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

Source: chaipakodi.com

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."