Beauty TipsHealthhealth tips in telugu

రోజుకు 5 నిమిషాలు ఇలా చేస్తే.. జుట్టు వద్దన్నా ఒత్తుగా పెరుగుతుంది!

Hair care Tips:జుట్టు రాలిపోతోందని, పలుచబడుతోందని బాధపడుతున్నారా? అయితే రోజుకు కేవలం 5 నిమిషాలు ఈ సింపుల్ హెయిర్ కేర్ టిప్ పాటిస్తే చాలు. మీ జుట్టు రాలడం ఆగిపోయి, కుదుళ్ల నుంచి బలంగా మారి వద్దన్నా ఒత్తుగా, పొడవుగా పెరుగుతుంది. ఎలాంటి ఖర్చు లేకుండా ఇంట్లోనే చేసుకోగలిగే ఆ అద్భుతమైన చిట్కా ఏంటో ఈ ఆర్టికల్‌లో వివరంగా తెలుసుకోండి.

5 నిముషాలు ఇలా చేస్తే చాలు మీ జుట్టు వద్దన్నాఒత్తుగా పొడవుగా పెరుగుతుంది.. ఈ రోజుల్లో వయస్సుతో సంబంధం లేకుండా చాలా మందికి జుట్టు రాలే సమస్య వస్తోంది. కొంత మందికి అయితే బట్టతల వచ్చేస్తోంది. ఇప్పుడు మనం జుట్టు పొడవుగా పెరగడానికి ఒక చిట్కా తెలుసుకుందాం. జుట్టుకి సంబంధించిన అన్ని రకాల సమస్యలను తగ్గిస్తుంది.

జుట్టు ఒత్తుగా మెరుస్తూ ఉంటుంది. ఈ రెమిడీ కోసం కేవలం మూడు ఇంగ్రిడియన్స్ మాత్రమే ఉపయోగిస్తున్నారు. ముఖం అందంగా ఉండాలి అంటే జుట్టు కూడా ఒక కీలకమైన పాత్రను పోషిస్తుంది. జుట్టు ఒత్తుగా పొడవుగా ఉంటే ఆ అందమే వేరు… కాబట్టి ప్రతి ఒక్కరు జుట్టు ఒత్తుగా పొడవుగా ఉండాలని కోరుకుంటారు.

ఒక బౌల్ లో ఒక స్పూన్ కలోంజీ పొడిని తీసుకొని దానిలో ఒక స్పూన్ ఆలోవెరా జెల్ మరియు ఒక విటమిన్ e క్యాప్సిల్ ఆయిల్ వేసి బాగా కలిపి జుట్టుకి పట్టించి అరగంట తర్వాత కుంకుడుకాయలతో తలస్నానం చేయాలి. ఈ విధంగా వారంలో 2 సార్లు చేస్తే క్రమంగా జుట్టు రాలే సమస్య, చుండ్రు వంటి అన్నీ సమస్యలు తొలగిపోతాయి.

కలోంజి గింజలు జుట్టు సంరక్షణలో చాలా బాగా సహాయపడతాయి. ఒకప్పుడు చాలా అరుదుగా లభించేవి. కానీ ఇప్పుడు సూపర్ మార్కెట్స్, ఆయుర్వేదం Shops, Online Stores లో చాలా విరివిగా లభ్యం అవుతున్నాయి. యాంటీ వైరల్ మరియు యాంటీ మైక్రోబయల్ లక్షణాలు ఉండుట వలన చుండ్రును తగ్గించి జుట్టును రాలకుండా చేస్తుంది.

కలబంద జెల్ అనేక ఔషధ గుణాలను కలిగి ఉండుట వలన జుట్టు సంరక్షణలో పురాతన కాలం నుండి వాడుతున్నారు. ఇందులో అధిక తేమ ఉంటుంది, జుట్టును మృదువుగా చేయడానికి సహాయపడుతుంది. అంతే కాకుండా కలబందలో ఉండే అనేక విటమిన్లు, మినరల్స్, ఎంజైములు, యాంటీ ఆక్సిడెంట్లు జుట్టు పొడవుగా, దృఢంగా ఉండేలా చేస్తాయి.

గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

Source: chaipakodi.com

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."