Beauty TipsHealthhealth tips in telugu

కేవలం 2 సార్లు ఇది రాస్తే చాలు.. తెల్ల జుట్టు శాశ్వతంగా నల్లగా మారుతుంది!

White Hair Turn Black:చిన్న వయసులోనే వచ్చే తెల్ల జుట్టు సమస్యతో ఇబ్బంది పడుతున్నారా? ఎలాంటి కెమికల్స్ వాడకుండా, ఇంట్లో ఉండే సహజసిద్ధమైన వస్తువులతో తయారు చేసిన ఈ మిశ్రమాన్ని కేవలం రెండుసార్లు జుట్టుకు రాస్తే చాలు. మీ తెల్ల జుట్టు మూలాల నుంచి నల్లగా ఎలా మారుతుందో, ఈ అద్భుతమైన హోమ్ రెమెడీ తయారీ విధానం ఏంటో ఈ ఆర్టికల్‌లో వివరంగా తెలుసుకోండి.

కేవలం రెండు సార్లు రాస్తే చాలు…జీవితంలో తెల్లజుట్టు సమస్య ఉండదు.. తెల్లజుట్టు సమస్య అనేది ఈ మధ్య కాలంలో చాలా చిన్న వయస్సులోనే రావటంతో చాలా కంగారు పడి మార్కెట్ లో దొరికే Hair Dye లు వాడేస్తూ ఉంటారు. వాటి వల్ల కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇంటి చిట్కాలను ఉపయోగించి తెల్లజుట్టును నల్లగా మార్చుకోవచ్చు.

దీని కోసం ముందుగా టీ డికాషన్ తయారుచేసుకోవాలి. టీ డికాషన్ కోసం పొయ్యి మీద గిన్నె పెట్టి గ్లాస్ నీటిని పోసి ఒక స్పూన్ టీ పొడి వేసి 5 నిమిషాల పాటు మరిగించి వడకట్టాలి. ఒక బౌల్ లో 2 స్పూన్ల హెన్నా పొడి, ఒక స్పూన్ పెరుగు, టీ డికాషన్ వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని గంట సేపు అలా ఉంచేయాలి.

ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి గంట తర్వాత తేలికపాటి షాంపూతో తలస్నానం చేయాలి. ఈ విధంగా వారంలో 2 సార్లు చేస్తే తెల్లజుట్టు క్రమంగా నల్లగా మారుతుంది. ఈ చిట్కా చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. కాస్త ఓపికగా చేస్తే ఇంటి చిట్కాలు బాగా సహాయపడతాయి. హెన్నా తెల్ల జుట్టును నల్లగా మార్చడమే కాకుండా జుట్టు ఒత్తుగా,బలంగా ఉండేలా చేస్తుంది.

జుట్టు మూలాలపై పనిచేసి జుట్టు తంతువులు ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. పెరుగులో ఉండే లాక్టిక్ ఆమ్లం వెంట్రుకలకు అవసరమైన పోషకాలు, ఖనిజాలను అందించడం వల్ల జుట్టు ఒత్తుగా, మెరుపుతో ఉంటుంది. టీ డికాషన్ లో ఉండే కెఫీన్ డయింగ్ ఏజెంట్ గా పనిచేస్తుంది.

గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

Source: chaipakodi.com

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."