Healthhealth tips in telugu

పాల కంటే 4 రెట్లు ఎక్కువ కాల్షియం ఉండే ఆకు.. ఇలా తీసుకుంటే ఎముకలు ఉక్కులా మారతాయి!

Munagaku benefits In Telugu : నేటి కాలంలో వయసుతో సంబంధం లేకుండా చాలామంది ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య కాల్షియం లోపం (Calcium Deficiency). దీనివల్ల చిన్న వయసులోనే మోకాళ్ల నొప్పులు, నడుము నొప్పి, కీళ్ల నొప్పులు, కొద్దిగా పనిచేసినా తీవ్రమైన అలసట వేధిస్తుంటాయి.

వీటికోసం వేల రూపాయలు ఖర్చు పెట్టి కాల్షియం మాత్రలు వాడుతుంటారు. కానీ, మన పెరట్లో ఎటువంటి ఖర్చు లేకుండా దొరికే మునగాకు (Moringa Leaves / Drumstick Leaves) తో ఇలా చేసుకొని తింటే జీవితంలో అసలు కాల్షియం లోపమే రాదు!

ఆయుర్వేదంలో మునగ చెట్టును ‘మ్యాజికల్ ట్రీ’ అని పిలుస్తారు. ఎందుకంటే ఇందులో పాల కంటే 4 రెట్లు ఎక్కువ కాల్షియం, నారింజ కంటే 7 రెట్లు ఎక్కువ విటమిన్-C, మరియు అరటిపండు కంటే 3 రెట్లు ఎక్కువ పొటాషియం ఉంటాయి.

మునగాకును ఆహారంలో చేర్చుకోవడం వల్ల కలిగే ఊహించని ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు చూద్దాం:

ఈ మధ్య కాలంలో కాల్షియం లోపం ఎక్కువగా కనిపిస్తుంది. ముఖ్యంగా 30 సంవత్సరాలు వచ్చే సరికి కాల్షియం లోపం కనపడుతుంది. కాల్షియం లోపం లేకుండా ఉండాలంటే ఆహారంలో మార్పులు చేసుకోవాలి. మనకు చాలా సులభంగా దొరికే మునగాకును రెగ్యులర్ గా వాడితే కాల్షియం లోపం తగ్గటమే కాకుండా ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి.

మునగాకుతో పప్పు,పొడి చేసుకుంటూ ఉంటాం. అలా కాకుండా పచ్చడి చేసుకుంటే రుచి చాలా బాగుంటుంది. పొయ్యి మీద పాన్ పెట్టి ఒక స్పూన్ మీగడ వేసి వేడి అయ్యాక ఒక స్పూన్ మెంతులు, అరస్పూన్ ఆవాలు, అరస్పూన్ జీలకర్ర, రెండు స్పూన్ల వేరుశనగ పప్పు, కొంచెం కరివేపాకు, నాలుగు పచ్చిమిరపకాయలు వేసి వేగించి పక్కన పెట్టాలి.

అదే పాన్ లో ఒక స్పూన్ మీగడ వేసి వేడి అయ్యాక రెండు కప్పుల మునగాకు వేసి వేగనివ్వాలి. మిక్సీ జార్ లో వేగించి పెట్టుకున్న మిశ్రమంను మిక్సీ చేసి..ఆ తర్వాత మునగాకు వేసి మెత్తగా మిక్సీ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక స్పూన్ తేనె, ఒక స్పూన్ నిమ్మరసం,కొంచెం పసుపు వేసి మరొకసారి మిక్సీ చేస్తే మునగాకు పచ్చడి రెడీ.

ఒక పాన్ లో ఒక స్పూన్ మీగడ వేసి వేడి అయ్యాక అరస్పూన్ జీలకర్ర, అరస్పూన్ మెంతులు,అరస్పూన్ ఆవాలు, ఒక స్పూన్ వెల్లుల్లి ముక్కలు, అరస్పూన్ మినపప్పు, చిటికెడు ఇంగువ వేసి వేగించి పచ్చడిలో కలపాలి. ఈ మునగాకు పచ్చడిని వారంలో రెండు సార్లు తినే విధంగా ప్రణాళిక వేసుకోవాలి.

ఈ పచ్చడి తినటం వలన మన శరీరానికి అవసరమైన కాల్షియం అంది ఎముకలు గుల్లగా మారకుండా బలంగా ఆరోగ్యంగా ఉండి కీళ్లనొప్పులు, మోకాళ్ళ నొప్పులు వంటివి ఉండవు. అలాగే విటమిన్ A సమృద్దిగా ఉండుట వలన కంటికి సంబందించిన సమస్యలు ఉండవు. ఎన్నో ప్రయోజనాలను అందిస్తుంది.

గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

Source: chaipakodi.com

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."