ఉల్లిపాయతో ఇలా చేస్తే చాలు.. 99% కీళ్ల నొప్పులు, నడుము నొప్పి చిటికెలో మాయం!
Onion joint Pains Home Remedies : నేటి కాలంలో వయసుతో సంబంధం లేకుండా చాలామందిని వేధిస్తున్న ప్రధాన సమస్య కీళ్ల నొప్పులు (Joint Pains). కాసేపు నిలబడినా, నడిచినా మోకాళ్ల నొప్పులు, నడుము నొప్పి, కాళ్లు మరియు చేతుల్లో లాగినట్లుగా ఉండే నరాల నొప్పులు తీవ్ర ఇబ్బందికి గురిచేస్తుంటాయి.
వీటి నుండి బయటపడటానికి చాలామంది నిత్యం పెయిన్ కిల్లర్స్ (Pain Killers) వాడుతుంటారు. కానీ వాటివల్ల కిడ్నీలపై ప్రభావం పడే ప్రమాదం ఉంది. అయితే, ఎలాంటి ఖర్చు లేకుండా మన వంటింట్లో ఉండే ఉల్లిపాయ (Onion) తో ఇలా చేస్తే 99% కీళ్ల నొప్పులు, నడుము నొప్పి చిటికెలో మాయమవుతాయి!
కూరల్లో రుచి కోసమే కాకుండా, ఉల్లిపాయలో నొప్పులను తగ్గించే అద్భుతమైన ఔషధ గుణాలు దాగి ఉన్నాయి. అవేంటో, దాన్ని నొప్పులకు ఎలా వాడాలో ఇప్పుడు వివరంగా చూద్దాం:
ఈ రోజుల్లో వయస్సుతో సంబంధం లేకుండా కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులు, నడుం నొప్పి వంటి ఎన్నో రకాల నొప్పులు వస్తున్నాయి. నొప్పులు రాగానే కంగారు పడి పెయిన్ కిల్లర్స్ వాడేస్తూ ఉంటారు. పెయిన్ కిల్లర్స్ ఎక్కువగా వాడటం వల్ల కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంది. .

అలా కాకుండా మన ఇంటిలో సహజ సిద్ధంగా దొరికే వస్తువులతో నొప్పుల నుండి ఉపశమనం కలిగేలా చేసుకోవచ్చు. కాస్త ఓపికగా చేసుకుంటే మంచి ఫలితం కనబడుతుంది. ఒక చిన్న ఉల్లిపాయను తీసుకుని పై తొక్క తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి.
పొయ్యి వెలిగించి గిన్నె పెట్టి ఒక గ్లాసు నీటిని పోసి కాస్త వేడయ్యాక ఉల్లిపాయ ముక్కల్ని వేసి ఐదు నిమిషాల పాటు మరిగించాలి.
ఈ నీటిని గ్లాసులోకి వడకట్టి ఒక స్పూన్ తేనె కలిపి ఉదయం లేదా రాత్రి పడుకోవడానికి ఒక అరగంట ముందు తాగాలి. ఈ విధంగా తాగుతూ ఉంటే నొప్పుల నుండి ఉపశమనం కలుగుతుంది. ఈ ఉల్లిపాయ నీటిని తాగుతూ మరొక చిట్కాను ఫాలో అయితే నొప్పుల నుండి చాలా తొందరగా ఉపశమనం కలుగుతుంది.
చిన్న ఉల్లిపాయను తొక్క తీసి తురుముకోవాలి. అలాగే ఒక అంగుళం అల్లం ముక్కను శుభ్రంగా కడిగి పై తొక్క తీసి తురుముకోవాలి. ఒక బౌల్ లో ఉల్లిపాయ తురుము, అల్లం తురుము, అర స్పూన్ ఉప్పు వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని నొప్పులు ఉన్న ప్రదేశంలో రాసి కవర్ అయ్యేలా ఒక క్లాత్ చుట్టాలి.
ఒక గంట అయ్యాక చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ రెండు చిట్కాలను ఫాలో అయితే నొప్పుల నుండి చాలా తొందరగా ఉపశమనం కలుగుతుంది. సమస్య తీవ్రంగా ఉంటే మాత్రం డాక్టర్ సూచనలు పాటిస్తూ ఇప్పుడు చెప్పిన ఈ చిట్కాలను ఫాలో అయితే చాలా తొందరగా ఉపశమనం కలుగుతుంది.
గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.
Source: chaipakodi.com

