బ్యూటీ పార్లర్ కు వెళ్లే టైమ్ లేదా? అయితే ఇంట్లోనే ఇలా చేస్తే మీ ముఖం నిగనిగలాడటం ఖాయం!
Face Glow Tips:రోజువారీ పనులతో బిజీగా ఉండే మహిళలకు బ్యూటీ పార్లర్ కి వెళ్లి గంటల తరబడి ఫేషియల్స్ చేయించుకునేంత సమయం, ఓపిక ఉండకపోవచ్చు. అయితే, పార్లర్ కి వెళ్లే పనిలేకుండా, వేల రూపాయలు ఖర్చు చేయకుండానే మన ఇంట్లో ఉండే సహజసిద్ధమైన వస్తువులతోనే ముఖాన్ని అందంగా, కాంతివంతంగా మార్చుకోవచ్చు.
కేవలం 10 నిమిషాలు కేటాయించి ఈ సింపుల్ టిప్స్ పాటిస్తే మీ ముఖంపై ఉన్న మచ్చలు, నలుపు తగ్గిపోయి చర్మం మృదువుగా, నిగనిగలాడుతూ మెరిసిపోతుంది. బ్యూటీ పార్లర్ లాంటి గ్లోను ఇంట్లోనే ఇచ్చే ఆ అద్భుతమైన ఫేస్ ప్యాక్స్ ఏంటి? వాటిని ఎలా తయారు చేసుకోవాలో ఈ ఆర్టికల్ లో వివరంగా తెలుసుకోండి. అందమైన చర్మాన్ని సులువుగా మీ సొంతం చేసుకోండి!
బ్యూటీ పార్లర్ కి వెళ్ళటానికి తీరిక, ఓపిక లేని వారు… ఇలా చేస్తే ముఖం మెరిసిపోతుంది.. మారిన వాతావరణ పరిస్థితులు, వాతావరణ కాలుష్యం వంటి అనేక రకాల కారణాలతో ముఖం మీద మురికి,మృతకణాలు పేరుకుపోయి ముఖం నల్లగా, నిస్తేజంగా మారిపోయి కాంతివిహీనంగా కనపడుతుంది. అలాంటి సమయంలో ఇప్పుడు చెప్పబోయే చిట్కాను ఫాలో అయితే ముఖం తెల్లగా,కాంతివంతంగా కనపడుతుంది.
ఈ చిట్కా కోసం మూడు ఇంగ్రిడియన్స్ ని ఉపయోగిస్తున్నాం. ఇవి మనకు ఇంటిలో సులభంగా అందుబాటులో ఉండేవే. గోధుమపిండిలో ఉండే బ్లీచింగ్ గుణాలు, పోషకాలు చర్మాన్ని సహజంగా బ్లీచ్ చేయటంలో సహాయపడతాయి. ఇది ముఖం మీద నలుపును,మృత కణాలను తొలగించి ముఖం తెల్లగా,కాంతివంతంగా ఉండేలా చేస్తుంది.

పెరుగు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచటంలో సహాయపడుతుంది.పెరుగులో ఉండే లాక్టిక్ ఆమ్లం ముఖం మీద పేరుకుపోయిన మృతకణాలను, నలుపును తొలగించి ముఖాన్ని కాంతివంతంగా చేస్తుంది. నిమ్మరసాన్ని ముఖానికి రాస్తే నలుపు, డల్ నెస్ తొలగిపోయి కాంతివంతంగా మారుతుంది. నిమ్మరసంలో ఉండే విటమిన్ సి,సిట్రిక్ ఆమ్లంముఖాన్ని తెల్లగా మారుస్తాయి.
ఇప్పుడు ప్యాక్ ఎలా తయారుచేయాలో తెలుసుకుందాం. ఒక బౌల్ తీసుకోని దానిలో ఒక స్పూన్ గోధుమపిండి, ఒక స్పూన్ పెరుగు, ఒక స్పూన్ నిమ్మరసం వేసి మూడు ఇంగ్రిడియన్స్ బాగా కలిసేలా కలపాలి. మూడు ఇంగ్రిడియన్స్ బాగా కలిసిపోయాయి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముఖానికి రాయాలి. ముఖానికి రాసే ముందు ముఖాన్ని గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.
ముఖానికి ప్యాక్ వేశాక రెండు నిమిషాల పాటు సున్నితంగా మసాజ్ చేయాలి. ప్యాక్ ఆరాక సాదారణమైన నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ ప్యాక్ ని ముఖం నిస్తేజంగా కనిపించినప్పుడు లేదా బయటకు వెళ్ళే ముందు వేసుకుంటే ముఖం తాజాగా, కాంతివంతంగా కనపడుతుంది. ముఖం మీద పెరుకుపోయిన మృతకణాలు,నలుపు తొలగిపోతాయి.
ఈ ప్యాక్ ని ట్రై చేయండి. పార్టీ లేదా ఫంక్షన్ వెళ్ళేటనికి అరగంట ముందు ఈ ప్యాక్ వేసుకుంటే బ్యూటీ పార్లర్ తో పనిలేకుండా ముఖం తెల్లగా,కాంతివంతంగా మెరిసిపోతుంది. కాస్త సమయాన్ని శ్రద్దని పెడితే చాలా తక్కువ ఖర్చులో చాలా సులభంగా ముఖాన్ని తెల్లగా మెరిసేలా చేసుకోవచ్చు.
గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.
Source: chaipakodi.com

