నిమ్మరసంలో నెయ్యి కలిపి తీసుకుంటున్నారా? ఈ సీజన్లో ఇది తాగితే శరీరంలో అద్భుతాలు జరుగుతాయి!
Ghee And Lemon Juice Benefits In telugu : ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, నిమ్మరసంలో కొద్దిగా స్వచ్ఛమైన నెయ్యి కలుపుకుని తీసుకోవడం వల్ల శరీరానికి అనేక అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు అందుతాయి. ముఖ్యంగా, సీజనల్ వ్యాధులు ప్రబలే ఈ కాలంలో ఇది శరీరానికి ఎంతో మేలు చేస్తుంది.
ఈ విభిన్న హెల్త్ డ్రింక్ను ఏ సమయంలో, ఏ మోతాదులో తీసుకోవాలి? దీనివల్ల ఇంకా ఎలాంటి లాభాలున్నాయి? పూర్తి వివరాలు తెలుసుకోండి!
మనం ప్రతి రోజు నెయ్యి, నిమ్మరసం రెండింటినీ వాడుతూనే ఉంటాం. నెయ్యి, నిమ్మరసంలో ఎన్నో పోషకాలు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అయితే ఈ రెండింటినీ కలిపి తీసుకుంటే రెట్టింపు ప్రయోజనాలు కలుగుతాయి. వాటి గురించి వివరంగా తెలుసుకుందాం.

ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో ఒక స్పూన్ నిమ్మరసం, అరస్పూన్ నెయ్యి వేసి బాగా కలిపి ఉదయం సమయంలో పరగడుపున తాగాలి. యాంటీ ఆక్సిడెంట్లు సమృద్దిగా ఉండుట వలన శరీరంలో రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తుంది. ఈ సీజన్ లో వచ్చే సమస్యలను తగ్గించటంలో చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది.
జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగుపడి తీసుకున్న ఆహారం బాగా జీర్ణం అయ్యేలా చేసి మలబద్దకం,గ్యాస్,కడుపు ఉబ్బరం వంటి సమస్యలు లేకుండా చేస్తుంది. శరీరంలో పేరుకుపోయిన వ్యర్ధాలు బయటకు పోవటమే కాకుండా శరీరంలో అదనంగా ఉన్న కొవ్వును కరిగించి అధిక బరువు సమస్యను కూడా తగ్గిస్తుంది.
ఒత్తిడి, డిప్రెషన్, ఆందోళన వంటి మానసిక సమస్యలు ఏమి లేకుండా ప్రశాంతంగా ఉంటారు. అలాగే రోజంతా అలసట లేకుండా హుషారుగా ఉంటారు. ఒక స్పూన్ నిమ్మరసంలో అరస్పూన్ నెయ్యి వేసి బాగా కలిపి ముఖానికి రాసి పది నిమిషాలు అయ్యాక గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకుంటే ముఖం మీద ముడతలు,మచ్చలు తొలగిపోతాయి.
ఈ మిశ్రమాన్ని జుట్టుకి పట్టించి అరగంట అయ్యాక కుంకుడుకాయలతో తలస్నానం చేస్తే చుండ్రు,జుట్టు రాలే సమస్య తగ్గుతుంది. కాబట్టి నెయ్యి, నిమ్మరసం కలిపి తీసుకొని ఇప్పుడు చెప్పిన ప్రయోజనాలను పొందండి. మన వంటింటిలో ఉండే పదార్ధాలతో చాలా సులభంగా ఎన్నో సమస్యల నుంచి బయట పడవచ్చు.
గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.
Source: chaipakodi.com

