జిమ్ వద్దు, డైట్ వద్దు.. రోజుకు 1 గ్లాసు ఇది తాగితే బానపొట్ట కూడా వెన్నలా కరిగిపోతుంది!
Weight Loss Milk In telugu : వ్యాయామం చేయడానికి సమయం లేదా? బాన పొట్టను తగ్గించుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేసి విసిగిపోయారా? అయితే మీ వంటింట్లో ఉండే వస్తువులతో తయారు చేసే ఈ అద్భుతమైన డ్రింక్ ట్రై చేయండి. రోజుకు ఒక్క గ్లాసు తాగితే పొట్ట చుట్టూ పేరుకుపోయిన మొండి కొవ్వు కూడా ఇట్టే కరిగిపోతుంది. ఆ డ్రింక్ ఎలా తయారు చేయాలో ఇక్కడ తెలుసుకోండి.
మారిన జీవన శైలి పరిస్థితులు, ఆహారంలో మార్పులు, శారీరక శ్రమ లేకపోవడం, ఫోన్, టీవీ చూస్తూ ఎక్కువసేపు అలా కూర్చుని ఉండిపోవడం, కొన్ని రకాల మందులు వాడటం,హార్మోన్ల అసమతుల్యత వంటి అనేక రకాల కారణాలతో మనలో చాలా మంది అధిక బరువు సమస్యతో బాధపడుతున్నారు.

అధిక బరువు సమస్య నుండి బయట పడటానికి చాలా తక్కువ ఖర్చులో చాలా సులభంగా ఇంటిలోనే సహజసిద్దమైన పదార్ధాలతో పాలను తయారుచేసుకుందాం. ప్రతి రోజు అరగంట వ్యాయామం చేస్తూ ఇప్పుడు చెప్పే పాలను తీసుకుంటే చాలా తొందరగా అధిక బరువు సమస్య నుంచి బయటపడవచ్చు.
పొయ్యి వెలిగించి ఒక గిన్నె పెట్టి ఒక గ్లాసు పాలను పోయాలి. పాలు కాస్త వేడి అయ్యాక అర స్పూను పచ్చి పసుపు కొమ్ము తురుము. చిటికెడు మిరియాల పొడి. చిటికెడు జాజికాయ పొడి. చిటికెడు లవంగాల పొడి. పావు స్పూన్ వాము. అర స్పూను అల్లం తురుము. పావు స్పూన్ ములేటి పొడి. రెండు ఖర్జూరాలను పేస్ట్ గా చేసి వేయాలి.
7 నుంచి 8 నిమిషాల పాటు మరిగించి ఈ పాలను వడగట్టి తీసుకోవాలి. ఈ పాలను ఉదయం లేదా రాత్రి పడుకోవడానికి గంట ముందు తీసుకుంటే శరీరంలో అదనంగా పేరుకుపోయిన కొవ్వు పెరగడమే కాకుండా అధిక బరువు సమస్య నుంచి బయటపడతారు. అలాగే శరీరంలో రోగ నిరోధక వ్యవస్థ బలోపేతం అవుతుంది .
అలాగే సీజన్ మారినప్పుడు వచ్చే దగ్గు,జలుబు,గొంతునొప్పి వంటి సమస్యలు రాకుండా కాపాడుతుంది. ఉదయం సమయంలో తాగితే అలసట, నీరసం లేకుండా రోజంతా హుషారుగా ఉంటారు. నిద్రలేమి సమస్యతో బాధపడేవారు రాత్రి సమయంలో తాగితే మంచి ప్రయోజనం కనపడుతుంది. కాస్త శ్రద్ద పెడితే మంచి ప్రయోజనం ఉంటుంది.
గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.
Source: chaipakodi.com

