Healthhealth tips in telugu

కూరల్లో పులుపు కోసం చింతపండు ఎక్కువగా వాడుతున్నారా? ఈ చేదు నిజం తెలిస్తే అస్సలు ముట్టుకోరు!

Chintapandu benefits In Telugu : సాంబార్, రసం, చేపల పులుసుల్లో చింతపండు లేనిదే ముద్ద దిగట్లేదా? అయితే చింతపండును రోజూ అతిగా వాడటం వల్ల శరీరానికి ఎంతటి నష్టం కలుగుతుందో తెలుసా? కీళ్ల నొప్పులు, ఎసిడిటీ వంటి సమస్యలకు ఇది ఎలా కారణమవుతుందో ఈ ఆర్టికల్‌లో వైద్యులు వెల్లడించిన నిజాలు తెలుసుకోండి.

మనం ప్రతి రోజు చేసుకొనే కూరల్లో చింతపండు వేస్తూ ఉంటాం. చింతపండు పుల్లగా ఉండి కూరకు మంచి రుచి వస్తుంది. అయితే చింతపండు ఎక్కువగా వాడితే సమస్యలు వస్తాయి. చింతపండులో కాల్షియం, ఫాస్పరస్, పొటాషియం మరియు మెగ్నీషియం వంటి ఖనిజాలు, విటమిన్ ఎ, బి3, బి9, సి మరియు కె వంటి ముఖ్యమైన విటమిన్లు ఉన్నాయి.

చింతపండులో డైటరీ ఫైబర్, పొటాషియం మరియు టార్టారిక్ యాసిడ్ సమృద్దిగా ఉండుట వలన మలబద్దకం సమస్యను తగ్గిస్తుంది. అలాగే ఫ్లేవనాయిడ్లు మరియు పాలీఫెనాల్స్ ఉండుట వలన చెడు కొలెస్ట్రాల్ ని తగ్గించి గుండె ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. శరీరంలో రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తుంది.

ఆధునిక జీవనశైలి కారణంగా మన వ్యవస్థలో అత్యంత ప్రభావితమైన అవయవాలలో ఒకటి కాలేయం. ఇది నిర్విషీకరణ మరియు జీర్ణక్రియపై కీలకమైన పాత్రను కలిగి ఉంటుంది. కాలేయం ఆరోగ్యంగా ఉండటానికి చింతపండు సహాయపడుతుంది. గర్భధారణ సమయంలో కూడా చింతపండు సహాయపడుతుంది.

గర్భధారణ సమయంలో వచ్చే వికారం, మార్నింగ్ సిక్నెస్ మరియు అతిగా తినడం వంటి వాటికి వ్యతిరేకంగా పోరాటం చేస్తుంది. అధిక బరువు సమస్యతో బాధపడేవారికి చింతపండు చాలా హెల్ప్ చేస్తుంది. శరీరంలో విషాలను బయటకు పంపుతుంది. అలాగే శరీరంలో అదనంగా ఉన్న కొవ్వును కరిగిస్తుంది. అయితే లిమిట్ గా తీసుకుంటేనే ఈ ప్రయోజనాలు కలుగుతాయి.

చింతపండు ఎక్కువగా వాడితే కొన్ని సమస్యలు వస్తాయి. అలాగే కొన్ని సమస్యలు ఉన్నవారు చింతపండు వాడకూడదు. చింతపండుకు బదులుగా టమోటా,నిమ్మరసం వంటి వాటిని వాడుకోవచ్చు. ముఖ్యంగా గ్యాస్ సమస్య ఉన్నవారు అసలు చింతపండు వాడకూడదు. ఒకవేళ వాడితే గ్యాస్ సమస్య తీవ్రం అవుతుంది.

గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

Source: chaipakodi.com

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."