Kitchenvantalu

మహిళల కోసం అద్భుతమైన వంటింటి చిట్కాలు.. ఇవి తెలిస్తే వంట చేయడం ఎంతో ఈజీ!

kitchen tips In Telugu :ఉదయం నిద్రలేచినప్పటి నుండి రాత్రి పడుకునే వరకు ఆడవారికి వంటగదిలో ఏదో ఒక పని ఉంటూనే ఉంటుంది. హడావిడిగా వంట చేయడం, గిన్నెలు తోమడం, కూరగాయలు సర్దడం.. ఇలా వంటగది పనులతోనే పుణ్యకాలం కాస్తా గడిచిపోతుంది.

అయితే, కొన్ని స్మార్ట్ ‘కిచెన్ హ్యాక్స్’ (Kitchen Hacks) పాటిస్తే మీ శ్రమ సగానికి సగం తగ్గిపోతుంది. గంటల కొద్దీ పట్టే పనులను చిటికెలో ఎలా పూర్తి చేయాలి? వంటగదిని ఎప్పుడూ శుభ్రంగా ఎలా ఉంచుకోవాలి? మీ సమయాన్ని, డబ్బును ఆదా చేసే ఆ అద్భుతమైన వంటింటి చిట్కాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ సింపుల్ టిప్స్ ప్రతి ఇల్లాలికి ఎంతగానో ఉపయోగపడతాయి.

సాధారణంగా మనం వంట చేసినప్పుడు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కొన్ని పొరపాట్లు జరగడం సహజమే. అయితే కొన్ని చిట్కాలను పాటిస్తే ఎలాంటి టెన్షన్ లేకుండా వంట ఈజీగా చేసేయొచ్చు.

వంటలు చేసినప్పుడు ఒక్కోసారి కూరల్లో ఉప్పు ఎక్కువ అవ్వచ్చు. అప్పుడు కూరలో కాస్త బియ్యప్పిండి లేదా బంగాళదుంప రెండు ముక్కలు వేస్తే కూరలో ఎక్కువైన ఉప్పు అంతా పీల్చుకుని కూరలో ఉప్పు సమానంగా ఉంటుంది.

చపాతీలు వేడిగా ఉన్నప్పుడు సాఫ్ట్ గా మెత్తగా ఉంటాయి. అదే చల్లారితే గట్టిగా అవుతాయి. చపాతీలు గట్టిగా అవ్వకుండా మెత్తగా ఉండాలి అంటే చపాతి పిండి కలిపేటప్పుడు కొంచెం పాలు వేసి కలపాలి. అంతేకాకుండా చపాతీ ఒత్తి కొద్దిగా ఆయిల్ వేసి మడత పెట్టి మళ్ళీ ఒత్తుకుంటే చపాతీలు ఎక్కువసేపు మెత్తగా ఉంటాయి.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."