ఈ కాయలు ఎక్కడ కనిపించినా పొరపాటున కూడా వదలకండి.. వీటిలోని ఆ సీక్రెట్ తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Parwal (budmakaya) Health Benefits In telugu : మన చుట్టుపక్కల ఎన్నో రకాల చెట్లు, మొక్కలు కనిపిస్తుంటాయి. కానీ వాటిలో దాగున్న అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు మనకు తెలియక వాటిని పిచ్చిమొక్కలుగా భావించి పీకేస్తుంటాం లేదా ఆ కాయలను పనికిరానివిగా భావించి పాడేస్తుంటాం.
అలా మనం రోజూ చూస్తూ, నిర్లక్ష్యం చేసే ఒక అద్భుతమైన కాయలో ఊహించని ఆరోగ్య రహస్యాలు దాగి ఉన్నాయి. ఆ విషయం తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఎన్నో రకాల అనారోగ్య సమస్యలను ఇట్టే తగ్గించే ఆ సంజీవని లాంటి కాయ ఏమిటి? దాని వల్ల మనకు కలిగే లాభాలు ఏంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం
బుడమకాయను పూర్వ కాలంలో ఎక్కువగా వాడేవారు. బుడమకాయతో పప్పు,ఆవకాయ,కూర,పచ్చడిగా చేసుకోవచ్చు.ఇది కొద్దిగా తీపి రుచిని కలిగి ఉంటుంది. బుడమకాయలలో ఎన్నో పోషకాలు ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ఇందులో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది.

బుడమకాయలో విటమిన్ సి, ఎ, ఫోలిక్ యాసిడ్, కాల్షియం, ఐరన్, ఫైబర్, ఫాస్పరస్, జింక్ మరియు యాంటీ ఆక్సిడెంట్లు సమృద్దిగా ఉంటాయి. అధిక బరువును తగ్గించటానికి సహాయపడుతుంది. ఫైబర్ సమృద్దిగా ఉండుట వలన కడుపు నిండిన భావన ఎక్కువసేపు ఉండటమే కాకుండా తినాలనే కోరికను తగ్గిస్తుంది.
యాంటీ ఆక్సిడెంట్లు సమృద్దిగా ఉండుట వలన ఫ్రీ రాడికల్స్‌ను నాశనం చేయడంలో సహాయపడుతుంది. అలాగే శరీర కణాల పెరుగుదల మరియు మరమ్మత్తును ప్రోత్సహిస్తుంది. అంతేకాకుండా రక్తాన్ని శుద్ధి చేయడానికి మరియు రకరకాల ఇన్ఫెక్షన్లు మరియు వ్యాధుల నుండి రక్షించడానికి సహాయపడుతుంది.
శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది. యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్దిగా ఉండుట వలన సన్నని గీతలు, ముడతలు, మచ్చలు మరియు చర్మ వృద్ధాప్య సంకేతాలను ఆలస్యం చేస్తుంది. రక్తపోటు నియంత్రణలో ఉంచటానికి మరియు రక్త నాళాల ఆరోగ్యాన్ని కాపాడుతుంది. దాంతో గుండె ఆరోగ్యంగా ఉంటుంది.
చెడు కొలెస్ట్రాల్ తగ్గించి మంచి కొలెస్ట్రాల్ పెరిగేలా ప్రోత్సహిస్తుంది. డయాబెటిస్ ఉన్నవారిలో రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచుతుంది. ఫైబర్ సమృద్దిగా ఉండుట వలన గ్యాస్, మలబద్దకం వంటి సమస్యలను తగ్గించటానికి సహాయపడుతుంది. కాలేయం పనితీరును సహాయపడటమే కాకుండా కామెర్లు చికిత్సలో కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.
Source: chaipakodi.com

