Healthhealth tips in telugu

ఆరోగ్యానికి మంచిదే కదా అని ‘పిస్తా పప్పులు’ గుప్పెళ్లు తింటున్నారా? అయితే మీరు ప్రమాదంలో పడ్డట్టే!

pistachios in telugu :డ్రై ఫ్రూట్స్ ఆరోగ్యానికి ఎంతో మంచివని మనందరికీ తెలుసు. అందులో ముఖ్యంగా ‘పిస్తా పప్పులు’ (Pistachios) రుచితో పాటు బోలెడన్ని పోషకాలను అందిస్తాయి. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడం నుండి రోగనిరోధక శక్తిని పెంచడం వరకు పిస్తా అద్భుతంగా పనిచేస్తుంది. అయితే, ఆరోగ్యానికి మంచిదే కదా అని వీటిని పరిమితికి మించి (Overeating Pistachios) తింటే మాత్రం లాభాల కంటే నష్టాలే ఎక్కువగా ఉంటాయి.

ముఖ్యంగా ఉప్పు కలిపిన రోస్టెడ్ పిస్తా పప్పులు ఎక్కువగా తినడం వల్ల జీర్ణ సమస్యలు, కిడ్నీల్లో రాళ్లు, అమాంతం బరువు పెరగడం, హై బీపీ వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలు (Pista Side Effects) వచ్చే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అసలు ఆరోగ్యంగా ఉండాలంటే రోజుకు ఎన్ని పిస్తా పప్పులు తినాలి? మోతాదు మించి తింటే శరీరానికి జరిగే నష్టం ఏంటో ఈ ఆర్టికల్‌లో వివరంగా తెలుసుకుందాం.

మనలో చాలా మంది డ్రై ఫ్రూట్స్ ని ఇష్టంగా తింటుంటారు. అలా తినే డ్రైఫ్రూట్స్ లో పిస్తా పప్పు ఒకటి. పసుపు పచ్చ వర్ణంలో ఉండే పిస్తా పప్పు ఒక ప్రత్యేకమైన రుచిని కలిగి ఉంటుంది. అందుకే వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ ఇష్టంగా తింటుంటారు.
pistachios in telugu
పిస్తా పప్పు ధర కాస్త ఎక్కువగా ఉన్నా సరే పోషకాలు మాత్రం అధికంగా ఉంటాయి. పిస్తా పప్పులో విటమిన్ ఏ,విటమిన్ బి,విటమిన్ E, ఫాస్ఫరస్,ఐరన్‌, కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం,ప్రోటీన్,ఫైబర్ ,యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్దిగా ఉంటాయి. పిస్తా పప్పును లిమిట్ గా తీసుకుంటే మెదడు షార్ప్ గా పనిచేస్తుంది.

అదే ఎక్కువగా తీసుకుంటే కిడ్నీలో రాళ్ళు ఏర్పడే అవకాశం ఉంది. పిస్తా పప్పును ఎక్కువగా తీసుకున్నప్పుడు కాల్షియం ఆక్సాలేట్ మ‌రియు సిస్టైన్ మూత్ర‌పిండాల్లో పేరుకు పోయి రాళ్లు ఏర్ప‌డేలా ప్రేరేపిస్తాయి. ఎలర్జీ వచ్చే అవకాశం ఉంది . ముఖ్యంగా ద‌ద్దుర్లు, చ‌ర్మం దుర‌ద పెట్ట‌డం, తుమ్ముళ్లు వంటి సమస్యలు వస్తాయి.

అందువల్ల ఎలర్జీ ఉన్నవారు పిస్తాపప్పుకు దూరంగా ఉంటేనే మంచిది. బరువు పెరిగే అవకాశం,క‌డుపు నొప్పి, మ‌ల‌బ‌ద్ధ‌కం, అతిసారం వంటి స‌మ‌స్య‌లు వస్తాయి. లిమిట్ గా తీసుకుంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనలు కలుగుతాయి. ఎక్కువగా తీసుకుంటే మాత్రం ఈ సమస్యలు తప్పవు. సాల్ట్ లేని పిస్తా పప్పు తీసుకుంటే మంచిది.

గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

Source: chaipakodi.com

“Pista side effects in telugu, eating too many pistachios, disadvantages of pista in telugu, dry fruits side effects, how many pistachios per day, health tips in telugu, పిస్తా పప్పులు నష్టాలు, పిస్తా పప్పులు ఎక్కువగా తింటే ఏమవుతుంది, డ్రై ఫ్రూట్స్ నష్టాలు, తెలుగు హెల్త్ టిప్స్.”

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."