నరాల బలహీనత మరియు తిమ్మిర్లను తగ్గించే పవర్ ఫుల్ పౌడర్ ఇదే!
Nerves weakness home remedies in telugu : ఏదైనా సమస్య వచ్చినప్పుడు ప్రారంభ దశలోనే తగ్గించుకోవాలి. సమస్య రాగానే డాక్టర్ సూచనలను పాటిస్తూ ఇప్పుడు చెప్పే ఇంటి చిట్కాలను ఫాలో అయితే చాలా తొందరగా ఉపశమనం కలుగుతుంది. నరాల బలహీనత అనేది ఈ మధ్య కాలంలో ఎక్కువ వినిపిస్తుంది. ఈ సమస్య డయబెటిస్ ఉన్నవారిలో కూడా ఎక్కువగా కనిపిస్తుంది.

దీని కోసం ఒక మిక్సీ జార్ లో ఒక కప్పు ఆవిసే గింజలు, ఒక కప్పు వాల్ నట్స్, పావుకప్పు మిరియాలు, అరకప్పు దాల్చినచెక్క, పావు కప్పు పటిక బెల్లం వేసి మెత్తని పొడిగా చేసుకోవాలి. ఈ పొడి దాదాపుగా నెల రోజుల పాటు నిల్వ ఉంటుంది. ఈ పొడిని ప్రతి రోజు ఒక గ్లాస్ గోరువెచ్చని పాలల్లో ఒక స్పూన్ వేసుకొని తాగితే 15 రోజుల్లో తేడా కనపడుతుంది.

ఈ పాలను తాగితే ఎన్నో రకాల సమస్యల నుండి బయట పడవచ్చు. ఈ పొడిలో వేసిన అన్నీ ఇంగ్రిడియన్స్ లోనూ ఉన్న పోషకాలు ఎన్నో ప్రయోజనాలను కలిగిస్తుంది. నరాల బలహీనతను తగ్గించటమే కాకుండా అధిక బరువు సమస్యను తగ్గించటానికి కూడా చాలా బాగా సహాయపడుతుంది.

ఈ పొడిని తయారుచేసుకున్నప్పుడు డయబెటిస్ ఉన్నవారి కోసం అయితే పటిక బెల్లం వేయకుండా చేసుకోవాలి. ఈ చిట్కా చాలా బాగా సహాయపడుతుంది. డయాబెటిస్ కారణంగా నరాలు బలహీన పడతాయి అధిక రక్తపోటు, నరాల లోపల ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు కూడా నరాలు బలహీనపడతాయి.

కొన్నిసార్లు హార్మోన్ల అసమతుల్యత కారణంగా కూడా నరాలు బలహీనం అవుతూ ఉంటాయి. ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు అసలు అశ్రద్ద చేయకూడదు. ఈ సమస్య రాగానే ముందుగా డాక్టర్ ని సంప్రదించి ఆ సూచనలను పాటించాలి. అలాగే ఆ సూచనలను పాటిస్తూ ఇంటి చిట్కాలను ఫాలో అయితే చాలా తొందరగా ఉపశమనం కలుగుతుంది.
గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.
Source: chaipakodi.com

