ఒక్క చెంచా చక్కెరతో ముఖంపై మురికి మాయం.. బ్యూటీ పార్లర్ కి వెళ్లాల్సిన పనే లేదు!
మొన్న ఈ మధ్య నేను కొద్ది రోజులు బయట తిరిగి వచ్చేసరికి చలిగాలికి, ఎండకు నా స్కిన్ బాగా డామేజ్ అయిపోయింది. ముఖం మీద డెడ్ స్కిన్ పెరిగిపోయి, సన్ టాన్ వల్ల విపరీతంగా నల్లగా మారిపోయింది. అద్దంలో చూసుకుంటే నాకే భయమేసింది! బయట దొరికే ఏవో కెమికల్ క్రీమ్స్ వాడితే ముఖం ఇంకా ఎక్కడ పాడవుతుందో అని ఆగిపోయాను. సరిగ్గా అప్పుడే నాకు ఒక అద్భుతమైన హోమ్ రెమిడీ తెలిసింది.
మన వంటింట్లో ఉండే ఒక చెంచా చక్కెర, కొబ్బరి నూనె మన ముఖంపై ఏళ్ల తరబడి పేరుకుపోయిన మురికిని ఎలా ఇట్టే మాయం చేస్తాయో చూసి నేను ఆశ్చర్యపోయాను. ఒక్క రూపాయి కూడా బయట ఖర్చు పెట్టకుండా నా ముఖాన్ని తిరిగి మునుపటిలా స్మూత్ గా, గ్లోయింగ్ గా మార్చుకున్న నా సొంత అనుభవం, ఆ రెమిడీని మీతో పంచుకుంటున్నాను.
స్టెప్ – 1: ముఖాన్ని మెరిపించే ‘షుగర్ అండ్ కోకోనట్ ఆయిల్’ స్క్రబ్
దీనికి కావాల్సినవి:
చక్కెర – 2 స్పూన్లు (కొంచెం బరకగా ఉండేలా దంచుకోవాలి, మరీ మెత్తటి పౌడర్ లా చేయకూడదు).
కొబ్బరి నూనె – 2 లేదా 3 స్పూన్లు (మీకు నచ్చితే బాదం నూనె లేదా ఆలివ్ ఆయిల్ కూడా వాడొచ్చు).
నిమ్మరసం – 2 లేదా 3 చుక్కలు (ఒకవేళ మీది మరీ సెన్సిటివ్ స్కిన్ అయితే నిమ్మరసాన్ని వాడొద్దు).

ఎలా తయారు చేయాలి?
ఒక బౌల్ లో బరకగా దంచుకున్న చక్కెరను వేసి, అందులో చక్కెర మునిగేంత వరకు కొబ్బరి నూనె కలపాలి. ఆ తర్వాత రెండు, మూడు చుక్కలు నిమ్మరసం కలపాలి. (ఈ మిశ్రమాన్ని మీరు ఒక గాజు లేదా ప్లాస్టిక్ సీసాలో పోసి పెట్టుకుంటే 15 రోజుల వరకు నిల్వ ఉంటుంది. ఎప్పుడైనా ఫంక్షన్స్ కు వెళ్ళే ముందు అప్పటికప్పుడు కూడా వాడుకోవచ్చు).
ఎలా వాడాలి?
ముందుగా ముఖాన్ని సోప్ లేదా ఫేస్ వాష్ తో శుభ్రంగా కడుక్కోవాలి. ఇప్పుడు ఈ స్క్రబ్ ని తీసుకుని ముఖం మీద, ముఖ్యంగా పెదాల చుట్టూ ఉన్న నలుపు మీద ఐదు, ఆరు నిమిషాల పాటు చేతితో చాలా మృదువుగా (నిదానంగా) రబ్ చేయాలి. సెన్సిటివ్ స్కిన్ ఉన్నవారు ఇంకాస్త నెమ్మదిగా స్క్రబ్ చేయాలి.
ఫలితం ఎలా ఉంటుంది?
చక్కెర డెడ్ స్కిన్ ను తొలగించి మంచి స్క్రబ్బర్ లా పనిచేస్తుంది. కొబ్బరి నూనె వల్ల చర్మం చాలా స్మూత్ గా తయారవుతుంది. ఈ రెండు కలిపి అప్లై చేయడం వల్ల ఫేస్ పై ఉన్న ముడతలు తగ్గిపోయి చర్మం కాంతివంతంగా మారుతుంది. ఐదు నిమిషాల స్క్రబ్బింగ్ తర్వాత చల్లటి నీళ్లతో ముఖం కడుక్కుంటే మీకే రిజల్ట్ ఇట్టే తెలిసిపోతుంది!
స్టెప్ – 2: కాంతివంతమైన చర్మం కోసం ‘కాఫీ అండ్ శెనగపిండి’ ఫేస్ ప్యాక్
స్క్రబ్బింగ్ పూర్తయ్యాక ముఖానికి మంచి ప్యాక్ వేసుకోవాలి.
దీనికి కావాల్సినవి:
కాఫీ పొడి – 1 స్పూన్
శెనగపిండి – 1 స్పూన్
కస్తూరి పసుపు – కొద్దిగా
కొబ్బరి నూనె – కొద్దిగా (ఒక అర స్పూన్)
నీళ్లు లేదా పాలు లేదా రోజ్ వాటర్ – ప్యాక్ కలుపుకోవడానికి తగినంత
ఎలా వాడాలి?
వీటన్నింటినీ ఒక శుభ్రమైన బౌల్ లో వేసుకుని ఫేస్ ప్యాక్ లా కలుపుకోవాలి. ఈ ప్యాక్ ని ముఖానికి, మెడకు (ఇలాగే చేతులకు, నల్లగా ఉన్న వీపుకు కూడా వాడుకోవచ్చు) అప్లై చేయాలి. ఒక 10 నిమిషాల పాటు ఆరనిచ్చి ఆ తర్వాత ముఖం కడుక్కోవాలి. ఈ కాఫీ, శెనగపిండి, పసుపు మన ముఖం మీద ఉన్న నలుపును పూర్తిగా లాగేసి బ్రైట్ గా చేస్తాయి.
నా మాటగా..
12 ఏళ్ల వయసు పైబడిన వాళ్ళందరూ, అబ్బాయిలు, అమ్మాయిలు ఎవరైనా ఈ న్యాచురల్ ఫేస్ ప్యాక్ ను వాడొచ్చు. నేను బయట నుండి వచ్చిన తర్వాత ఈ ప్రాసెస్ చేశాక, నా స్కిన్ ఎంత స్మూత్ గా, బ్రైట్ గా మారిందో నా కళ్ళను నేనే నమ్మలేకపోయాను. ఈ ప్రాసెస్ ని వారానికి రెండుసార్లు ట్రై చేయండి, ఇక ఏ కెమికల్ క్రీమ్స్ కొనాల్సిన పనే ఉండదు!
గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.
Source: chaipakodi.com

