Healthhealth tips in telugu

ఖరీదైన డ్రై ఫ్రూట్స్ కొనలేకపోతున్నారా? అయితే ఈ ‘చీప్ అండ్ బెస్ట్’ విత్తనాల గురించి తెలుసుకోవాల్సిందే!

ఈ మధ్య నేను ఒక సూపర్ మార్కెట్ కి వెళ్లి డ్రై ఫ్రూట్స్ కొందామని చూస్తే.. బాదం, వాల్ నట్స్, పిస్తా ధరలు చూసి నా కళ్లు బైర్లు కమ్మాయి. “అబ్బో.. ఇవి మనబోటి మిడిల్ క్లాస్ వాళ్ళు, సామాన్యులు కొనేవి కావులే” అని నిరాశగా వెనక్కి వచ్చేశాను. ఆరోగ్యం మీద శ్రద్ధ ఉన్నా సరే, అంతంత డబ్బులు పోసి కొనే స్థోమత అందరికీ ఉండదు కదా.

అప్పుడే నాకు YOUTUBEలో ఒక వీడియో కనిపించింది. ఆ వీడియో లో విషయాలు విన్నాక, ఖరీదైన డ్రై ఫ్రూట్స్ అవసరం లేకుండానే మనకి కావాల్సిన పూర్తి పోషకాలను చాలా తక్కువ ఖర్చుతో ఎలా పొందొచ్చో నాకు అర్థమైంది.

కాస్ట్లీ నట్స్ కి మనకు అందుబాటులో ఉండే బెస్ట్ ఆల్టర్నేటివ్స్ ఇవే:
1. వాల్ నట్స్ (Walnuts) బదులు – అవిసె గింజలు (Flax Seeds), చియా సీడ్స్ (Chia Seeds)
మెదడు, నరాలు చురుగ్గా పని చేయాలంటే ‘ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్’ చాలా అవసరం. దానికి అందరూ వాల్ నట్స్ తినమంటారు. కానీ వాటి ధర వింటేనే భయం వేస్తుంది.

లెక్క ప్రకారం.. 100 గ్రాముల వాల్ నట్స్ లో 10-11 గ్రాముల ఒమేగా 3 ఉంటే, వాటి కంటే మూడు రెట్లు తక్కువ ధరకు దొరికే చియా సీడ్స్ లో ఏకంగా 18 గ్రాములు, అవిసె గింజల్లో 13 గ్రాములు ఉంటుంది. నేను ఇప్పుడు ఈ విత్తనాలను రోస్ట్ చేసుకుని రోజుకో రెండు స్పూన్లు తింటున్నాను, వాల్ నట్స్ కంటే ఇవే నాకు ది బెస్ట్ అనిపించింది.

2. బాదం పప్పు (Almonds) బదులు – పొద్దుతిరుగుడు గింజలు (Sunflower Seeds)
వయసు పైబడకుండా యవ్వనంగా, చర్మం ముడతలు పడకుండా ఉండాలంటే విటమిన్ E చాలా ముఖ్యం. బాదం పప్పులో విటమిన్ E పుష్కలంగా ఉంటుంది కాబట్టి చాలామంది దాన్ని సిఫార్సు చేస్తారు. కానీ అంత ఖర్చు పెట్టలేని నా లాంటి వారికి పొద్దుతిరుగుడు గింజలు గొప్ప ఆప్షన్. బాదంలో 28-30 mg విటమిన్ E ఉంటే, చవకైన పొద్దుతిరుగుడు గింజల్లో ఏకంగా 35 mg ఉంటుంది!

3. జీడిపప్పు (Cashews) బదులు – పల్లీలు లేదా వేరుశెనగ (Peanuts)
జీడిపప్పు కేజీ సుమారు 600 నుండి వెయ్యి రూపాయల దాకా ఉంటుంది. కానీ కేవలం 120-150 రూపాయలకే దొరికే వేరుశెనగ పప్పులు జీడిపప్పుకు ఏమాత్రం తీసిపోవు. రుచికి రుచి, బలానికి బలం! ఇప్పుడు నేను స్నాక్స్ కింద పల్లీలనే వేయించుకుని తింటున్నాను.

4. పిస్తా (Pistachios) బదులు – పుచ్చ గింజల పప్పు (Watermelon Seeds)
పిస్తా పప్పులో 626 కేలరీల శక్తి ఉంటే, పుచ్చ గింజల పప్పులో 628 కేలరీల శక్తి ఉంటుంది. పైగా పిస్తా కంటే పుచ్చ గింజలు రెండు, మూడు రెట్లు తక్కువ ధరకే దొరుకుతాయి. నాకైతే ఇదొక గొప్ప డిస్కవరీ అనిపించింది.

5. మెదడుకి శక్తినిచ్చే – పచ్చి కొబ్బరి (Fresh Coconut)
మెదడుకి కావాల్సిన మంచి కొవ్వులు (Good Fats) కొబ్బరిలో పుష్కలంగా ఉంటాయి. పాతిక రూపాయలు పెడితే ఒక కొబ్బరికాయ వస్తుంది, అంటే ఒక్క చెక్క 10-12 రూపాయలు పడుతుంది. ఈ రోజుల్లో ఆ రేటుకి కనీసం వాటర్ బాటిల్ కూడా రావట్లేదు. అలాంటిది రోజుకో కొబ్బరి చెక్క తింటే 4-5 కోడిగుడ్లు తిన్నంత బలం వస్తుందని రాజుగారు చెప్పారు. ఈ చిట్కా ఫాలో అయ్యాక నాలో నీరసం కూడా చాలా మట్టుకు తగ్గింది.

6. గుమ్మడి గింజల బదులు – నువ్వులు (Sesame Seeds)
శరీరానికి జింక్ అందాలంటే గుమ్మడి గింజలు తినమంటారు. కానీ అవి కొంచెం కాస్ట్లీ అనుకుంటే, మన ఇళ్లల్లో ఎప్పుడూ ఉండే నువ్వులు వాడొచ్చు. గుమ్మడి గింజలతో సమానంగా నువ్వుల్లో కూడా జింక్ దొరుకుతుంది, పైగా చాలా చవక.

నా మాటగా..
ఖరీదైన మాంసకృత్తులు, డ్రై ఫ్రూట్స్ కొనలేకపోతున్నామని ఇక బాధపడాల్సిన పనే లేదు. రోజుకు ఒక 100 గ్రాముల ఈ చవకైన విత్తనాలను రాత్రి నానబెట్టుకుని ఉదయాన్నే తింటే చాలు.. ఇమ్యూనిటీ, కండపుష్టి, హార్మోన్స్ బ్యాలెన్స్ అమాంతం మెరుగవుతాయి. ఇప్పుడు మా ఇంట్లో ఇవే వాడుతున్నాం, మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి! మీకు ఖచ్చితంగా మార్పు కనిపిస్తుంది.

గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

Source: chaipakodi.com

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."