Healthhealth tips in telugu

నరాల బలహీనత, రక్తహీనత తగ్గి శరీరం ఉత్సాహంగా ఉండాలంటే.. రోజూ ఉదయాన్నే ఈ ఒక్కటి తీసుకోండి!

Dates Milk Health benefits In telugu : నేటి కాలంలో వయసుతో సంబంధం లేకుండా చాలామందిని వేధిస్తున్న ప్రధాన సమస్యలు నరాల బలహీనత, రక్తహీనత (హిమోగ్లోబిన్ తగ్గడం), కీళ్లు మరియు ఒంటి నొప్పులు. కొద్దిసేపు పని చేయగానే విపరీతమైన నీరసం, అలసట రావడం, కాళ్లు చేతులు తిమ్మిర్లు ఎక్కడం వంటి లక్షణాలు కనిపిస్తుంటాయి.

మందుల మీద ఆధారపడకుండా మన వంటింట్లో ఉండే సహజమైన పోషకాలతోనే ఈ సమస్యల నుండి ఉపశమనం పొందవచ్చు. దీనిని వరుసగా 7 రోజులు మీ డైట్‌లో చేర్చుకోవడం వల్ల కలిగే ముఖ్యమైన లాభాలు..

ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికీ ఏదో ఒక సమయంలో ఏదో ఒక సమస్య వస్తూ ఉంటుంది. సమస్య చిన్నగా ఉన్నప్పుడు ఇంటి చిట్కాలను ఫాలో అవ్వవచ్చు. ఇప్పుడు కీళ్లనొప్పులు, మోకాళ్ళ నొప్పులు, ఒంటి నొప్పులు, రక్తహీనత వంటి సమస్యలను తగ్గించుకోవటానికి పాలను తయారుచేసుకుందాం.
Health Benefits of Dates
కాస్త ఓపికగా ఈ పాలను తయారుచేసుకొని తాగితే మంచి ఫలితం కనపడుతుంది. ముందుగా 10 ఖర్జూరాలు, 10 బాదం పప్పులను నీటిలో రాత్రి సమయంలో నానబెట్టాలి. మరుసటి రోజు ఉదయం ఖర్జూరాలలో గింజలను తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయాలి. నానిన బాదం పప్పు తొక్కలను తీసేయాలి.
Diabetes patients eat almonds In Telugu
ఖర్జూరం,బాదం పప్పులను మిక్సీలో వేసి మెత్తని పేస్ట్ గా తయారుచేసుకోవాలి. ఈ పేస్ట్ ని ఫ్రిజ్ లో పెడితే దాదాపుగా వారం రోజులు నిల్వ ఉంటుంది. పొయ్యి మీద గిన్నె పెట్టి ఒక గ్లాస్ పాలను పెట్టి కాస్త వేడి అయ్యాక ఒక స్పూన్ ఖర్జూరం,బాదం పేస్ట్ ని వేసి ఒక నిమిషం మరిగించాలి.
weight loss tips in telugu
ఆ తర్వాత పావు స్పూన్ పసుపు, చిన్న దాల్చిన చెక్క ముక్క, చిన్న బెల్లం ముక్క వేసి 3 నిమిషాల పాటు మరిగించాలి. మరిగిన పాలను గ్లాస్ లో పోసుకొని తాగాలి. ఈ విధంగా ఈ పాలను వారం రోజులు తాగాలి. ఆ తర్వాత ఒక వారం గ్యాప్ ఇచ్చి మరల వారం రోజులు తాగాలి. ఈ విధంగా ఈ పాలను తాగుతూ ఉంటే కీళ్లనొప్పులు, మోకాళ్ళ నొప్పులు, రక్తహీనత వంటివి ఏమి ఉండవు.

అలాగే నరాల బలహీనత సమస్య ఉన్నవారికి కూడా మంచి ప్రయోజనం కనపడుతుంది. కాస్త ఓపికగా ఈ పాలను తాగితే మంచి ఫలితాన్ని పొందుతారు. ఖర్జూరం మరియు బాదం పప్పు మనకు చాలా సులభంగా అందుబాటులో ఉంటుంది. మంచి పోషకాలు ఉన్న ఆహారం తీసుకుంటే ఎటువంటి సమస్యలు లేకుండా ఆరోగ్యంగా ఉంటాం.

గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

Source: chaipakodi.com

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."