సమయం వృధా కాకుండా.. ప్రతి మహిళకు కచ్చితంగా తెలియాల్సిన టాప్ కిచెన్ హ్యాక్స్
ఉదయం లేచినప్పటి నుంచి వంటగదిలోనే ఎక్కువ సమయం గడుపుతున్నారా? కూరగాయలు పాడైపోవడం, పాలు పొంగిపోవడం, కూరల్లో ఉప్పు ఎక్కువవడం లాంటి సమస్యలతో విసిగిపోతున్నారా?
అయితే ఈ స్మార్ట్ కిచెన్ హ్యాక్స్ (Kitchen Hacks) మీకోసమే! వంటను మరింత వేగంగా, సులభంగా, రుచిగా మార్చే అద్భుతమైన వంటింటి చిట్కాలను ఇక్కడ తెలుసుకోండి. ఈ ట్రిక్స్ పాటిస్తే మీ సమయం, శ్రమ రెండూ ఆదా అవుతాయి!

పాలు పొంగకుండా ఉండాలంటే: పాలు కాచే గిన్నె అంచులకు కొద్దిగా నెయ్యి లేదా వంట నూనె రాస్తే పాలు పొంగి కింద పడవు. అలాగే పాలు కాచేటప్పుడు గిన్నె అడ్డుగా ఒక చెక్క గరిటెను పెట్టినా పాలు పొంగవు.
రొటీన్ గా చేసే టమాటా రసం బోర్ కొట్టిందా? అయితే అన్నంలోకి ఇలా కమ్మని ‘క్యారెట్ రసం’ చేసి చూడండి!

కూరల్లో ఉప్పు ఎక్కువైతే: కంగారు పడకండి! ఒక బంగాళదుంపను తొక్కతీసి రెండు ముక్కలుగా కోసి కూరలో వేసి ఒక 10 నిమిషాలు ఉడికించండి. ఇది అదనపు ఉప్పును పీల్చుకుంటుంది. వడ్డించే ముందు ఆ ముక్కలను తీసేయండి.

కన్నీళ్లు రాకుండా ఉల్లిపాయలు కోయాలా?: ఉల్లిపాయలు కోసేటప్పుడు కన్నీళ్లు రాకూడదంటే.. వాటిని కోసే అరగంట ముందు ఫ్రిజ్లో ఉంచండి, లేదా తొక్క తీసి చల్లటి నీటిలో 10 నిమిషాలు ఉంచి ఆ తర్వాత కట్ చేయండి.

పచ్చిమిర్చి ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే: పచ్చిమిర్చి త్వరగా కుళ్లిపోకుండా ఉండాలంటే.. వాటి తొడిమలు (కాడలు) తీసేసి, గాలి చొరబడని డబ్బాలో (Air-tight container) అడుగున టిష్యూ పేపర్ వేసి ఫ్రిజ్లో పెట్టుకోవాలి.

నిమ్మకాయల నుండి ఎక్కువ రసం రావాలంటే: నిమ్మకాయల నుంచి ఎక్కువ రసం పిండాలంటే, వాటిని కోసే ముందు కొద్దిసేపు గోరువెచ్చని నీళ్లలో వేయండి. లేదా నేలపై పెట్టి అరచేత్తో కాస్త గట్టిగా రోల్ (Roll) చేయండి.
గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.
Source: chaipakodi.com

