వారానికి 3 సార్లు ఈ పాలు తాగితే చాలు.. కీళ్ల నొప్పులు, నడుము నొప్పి మాయం!
వయసు మీద పడుతున్న కొద్దీ ఎముకలు అరిగిపోవడం, కీళ్ల నొప్పులు, నడుం నొప్పి రావడం సహజం. అయితే ప్రస్తుతం మారిన వాతావరణ పరిస్థితులు, జంక్ ఫుడ్ అలవాట్ల కారణంగా.. చిన్న వయసులోనే చాలా మంది క్యాల్షియం, విటమిన్ల లోపంతో బాధపడుతున్నారు. దీనివల్ల ఏ చిన్న పని చేసినా నీరసం, అలసట రావడం, ఊరికే ఆయాసపడటం, జుట్టు విపరీతంగా రాలిపోవడం, కండరాల నొప్పులు లాంటివి నిత్యం వేధిస్తుంటాయి.
ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడేవారికి మన వంటగదిలో దొరికే పదార్థాలతో ఇంట్లోనే సులభంగా తయారు చేసుకునే ఒక అద్భుతమైన పానీయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. (సమస్య మరీ తీవ్రంగా ఉంటే మాత్రం డాక్టర్ను సంప్రదిస్తూనే ఈ ఇంటి చిట్కాను కూడా పాటిస్తే త్వరగా కోలుకుంటారు).

తయారీకి కావాల్సిన పదార్థాలు:
నెయ్యి – 1 స్పూన్
గసగసాలు – 1 స్పూన్
పాలు – 1 గ్లాసు
సోంపు – 1/2 స్పూన్
ఎండు కొబ్బరి తురుము – 1/2 స్పూన్
పటిక బెల్లం (మిశ్రీ) – రుచికి సరిపడా
ఎలా తయారు చేసుకోవాలి?
ముందుగా స్టవ్ మీద గిన్నె పెట్టి, అందులో ఒక స్పూన్ నెయ్యి వేసి వేడి చేయాలి.నెయ్యి కాస్త వేడెక్కాక అందులో ఒక స్పూన్ గసగసాలు వేసి దోరగా వేయించుకోవాలి.
గసగసాలు వేగిన తర్వాత అందులో ఒక గ్లాసు పాలు పోయాలి.పాలు కాస్త వేడెక్కుతున్న సమయంలో.. అర స్పూన్ సోంపు, తీపికి సరిపడా పటిక బెల్లం, అర స్పూన్ ఎండు కొబ్బరి తురుము వేసి బాగా కలుపుకోవాలి.
ఈ పాలను సన్నని మంట మీద కనీసం 7 నుంచి 8 నిమిషాల పాటు బాగా మరిగించాలి.ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని, పాలు గోరువెచ్చగా ఉన్నప్పుడే తాగేయాలి.
ఎలా పనిచేస్తుంది? ఉపయోగాలు ఏంటి?
ఈ పాలను వారంలో కనీసం మూడుసార్లు తాగితే మీకే అద్భుతమైన మార్పు కనిపిస్తుంది. శరీరంలో క్యాల్షియం, మెగ్నీషియం, పొటాషియం లోపాలు ఇట్టే తొలగిపోతాయి. నీరసం, నిస్సత్తువ మాయమై రోజంతా యాక్టివ్గా ఉంటారు. మోకాళ్ల నొప్పులు, కీళ్ల నొప్పుల నుంచి కూడా మంచి ఉపశమనం లభిస్తుంది.
ముఖ్యంగా ఇందులో వాడిన గసగసాలు శరీరంలో క్యాల్షియం స్థాయిలను పెంచి, నొప్పుల తీవ్రతను తగ్గిస్తాయి. ఇక సోంపులో ఉండే విటమిన్లు, ఐరన్, మెగ్నీషియం జీర్ణక్రియను మెరుగుపరచడమే కాకుండా శరీరానికి మంచి బలాన్ని ఇస్తాయి. కాస్త ఓపిక చేసుకుని ఇంట్లోనే ఈ పాలను తయారుచేసుకుని తాగితే నొప్పుల నుంచి చక్కటి ఉపశమనం పొందవచ్చు.
గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.
Source: chaipakodi.com

