Healthhealth tips in telugu

అర గ్లాసు ఈ మ్యాజిక్ డ్రింక్ తాగితే చాలు.. గొంతు నొప్పి, ఇన్ఫెక్షన్ కు శాశ్వతంగా చెక్ పెట్టినట్లే!

Cough Home Remedies : వాతావరణం మారినప్పుడల్లా దగ్గు, జలుబు, గొంతు నొప్పితో ఇబ్బంది పడుతున్నారా? హాస్పిటల్స్ చుట్టూ తిరిగే పనిలేకుండా ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోగలిగే అద్భుతమైన హెల్త్ డ్రింక్ గురించి ఈ కథనంలో తెలుసుకోండి. రోజుకు అరగ్లాసు ఈ డ్రింక్ తాగితే గొంతు ఇన్ఫెక్షన్ల నుండి తక్షణ ఉపశమనం లభిస్తుంది

ప్రస్తుతం సీజన్ మారింది. ఈ సీజన్లో సాధారణంగా ప్రతి ఒక్కరిని దగ్గు, జలుబు, గొంతు నొప్పి వంటివి వేధిస్తూ ఉంటాయి. ఇవి వచ్చాయంటే ఒక పట్టానా తగ్గవు. మన వంటింట్లో ఉండే మూడు వస్తువులతో చాలా సులభంగా .సీజనల్ గా వచ్చే దగ్గు, జలుబు, గొంతు నొప్పి, గొంతు ఇన్ఫెక్షన్ వంటి సమస్యల నుంచి బయటపడవచ్చు. .
Ginger benefits in telugu
దీనికోసం అల్లం తీసుకుంటున్నాం. అల్లంలో జంజిరాల్ అని పవర్ ఫుల్ యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది. అంతేకాకుండా యాంటీ వైరల్., యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉండటం వలన గొంతు, ముక్కు భాగాలలో ఇన్ ఫ్లమేషన్ తగ్గించడానికి చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది. ఇక ఆ తర్వాత మిరియాలు తీసుకోవాలి.

మిరియాలలో పెప్పరిన్ అని కెమికల్ కాంపౌండ్ ఉంటుంది. ఇది గాలి గొట్టాలను ఫ్రీగా ఉండేలా చేసి గాలి బాగా ఆడేటట్టు చేస్తుంది. గాలి గొట్టంలో గాలి వెంటిలేషన్ బాగా జరిగి యాంటీ బ్యాక్టీరియా యాంటీ వైరల్ గా పనిచేసి కఫం తగ్గించడానికి సహాయపడుతుంది. దగ్గు, జలుబు రెండింటికి మిరియాలు చాలా బాగా పనిచేస్తాయి.

ఇక ఆ తర్వాత వాము తీసుకోవాలి. వాములో థైమోల్ అనే కెమికల్ ఉంటుంది. గొంతులో పేరుకుపోయిన కఫం తగ్గించటానికి చాలా బాగా సహాయపడుతుంది. పొయ్యి మీద గిన్నె పెట్టి ఒక గ్లాసు నీటిని పోయాలి. అంగుళం అల్లం ముక్కను చిన్ని చిన్ని ముక్కలుగా కట్ చేసి వేయాలి. ఆ తర్వాత 10 మిరియాలను దంచి వేయాలి.

ఆ తర్వాత అర స్పూన్ వాము వేసి నీరు సగం అయ్యే వరకు మరిగించాలి. ఈ నీటిని వడగట్టి తేనె కలుపుకొని టీ తాగినట్టుగా తాగాలి. ఇలా రోజులో రెండుసార్లు తాగితే మంచి ఉపశమనం కలుగుతుంది. ఈ విధంగా పాలల్లో కాకుండా నీటిలో మరిగిస్తేనే చాలా తొందరగా మంచి ప్రయోజనం కనబడుతుంది. కొంతమంది పాలల్లో వీటిని వేసి మరిగించి తాగుతూ ఉంటారు.

గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

Source: chaipakodi.com

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."