మెడ మీద పేరుకుపోయిన నలుపు వదలట్లేదా? స్నానానికి ముందు ఇలా చేస్తే నిమిషాల్లో మెరిసిపోతుంది!
ముఖం ఎంత గ్లోగా మెరిసిపోతున్నా.. మెడ నల్లగా ఉంటే ఆ ఇబ్బందే వేరు కదా! నలుగురిలోకి వెళ్లాలన్నా, నచ్చిన డ్రెస్ (ముఖ్యంగా డీప్ నెక్ డ్రెస్సులు) వేసుకోవాలన్నా చాలా నాకైతే చాలా ఇబ్బందిగా అనిపించేది. ఒకప్పుడు నేనూ ఈ డార్క్ నెక్ (Dark Neck) సమస్యతో చాలా బాధపడ్డాను. ఎన్నో ఖరీదైన క్రీమ్స్ వాడాను, స్కిన్ డాక్టర్లను కలిసినా పెద్దగా రిజల్ట్ కనిపించలేదు. అప్పుడే నాకు అసలు మెడ ఎందుకు నల్లబడుతుంది అనేది అర్థమైంది.
నిజానికి మనం ముఖం మీద పెట్టే శ్రద్ధ మెడ మీద అస్సలు పెట్టం. ముఖానికి రకరకాల ఫేస్ వాష్‌లు, క్రీమ్స్ రాస్తాం కానీ, మెడను మాత్రం వదిలేస్తాం. మెడ దగ్గర చర్మం చాలా సున్నితంగా ఉంటుంది. సరిగ్గా స్నానం చేసేటప్పుడు రుద్ది కడుక్కోకపోతే ముడతలు పడిపోయి, అందులో దుమ్ము చేరిపోయి నల్లగా మారిపోతుంది. దానికి తోడు నేను వయస్సుకు మించి కొంచెం బరువు పెరగడం వల్ల కూడా ఈ నలుపు ఇంకాస్త ఎక్కువైందని గ్రహించాను.

ఎన్ని వాడినా తగ్గని ఈ మెడ నలుపును.. కేవలం నా వంటగదిలో ఉండే మూడు వస్తువులతో నేను ఎలా తగ్గించుకున్నానో మీతో పంచుకోవాలనుకుంటున్నాను.
నేను వాడిన ఆ మూడు ఇంగ్రిడియంట్స్ ఇవే:
కాఫీ పొడి: ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇది చర్మానికి మంచి స్క్రబ్‌లా పనిచేసి రక్త ప్రసరణను పెంచుతుంది.
నిమ్మరసం: నిమ్మలో ఉండే విటమిన్ సి, నాచురల్ బ్లీచింగ్ లక్షణాలు మెడ మీద ఉన్న మొండి నలుపును వదిలించడానికి అద్భుతంగా పనిచేశాయి.
రోజ్ వాటర్: ఇది చర్మాన్ని చల్లబరిచి, నలుపును క్రమంగా తగ్గిస్తుంది.
నేను ఈ ప్యాక్ ఎలా వాడానంటే:
ఒక చిన్న బౌల్ తీసుకుని అందులో ఒక స్పూన్ కాఫీ పొడి, ఒక స్పూన్ నిమ్మరసం, ఒక స్పూన్ రోజ్ వాటర్ వేసి పేస్ట్‌లా బాగా కలుపుకున్నాను. ఇప్పుడు మనం రసం పిండేసిన సగం నిమ్మ చెక్కను తీసుకుని, ఈ మిశ్రమంలో ముంచి నా మెడపై నలుపు ఉన్న చోట సున్నితంగా, వృత్తాకారంలో (circular motion) కేవలం 2 నిమిషాల పాటు మసాజ్ చేసుకున్నాను. ఆ తర్వాత నార్మల్ వాటర్ తో కడిగేసుకున్నాను.
నా రిజల్ట్:
నేను ఇలా వారానికి రెండుసార్లు చేయడం మొదలుపెట్టాను. ఆశ్చర్యంగా కొద్ది రోజుల్లోనే నా మెడ మీద పేరుకుపోయిన నలుపు పూర్తిగా తగ్గిపోయి, ముఖంతో పాటు మెడ కూడా కాంతివంతంగా మారింది. ఖరీదైన క్రీమ్స్ చేయలేని పని ఈ చిన్న చిట్కా చేసింది. మీరు కూడా ఒకసారి నా చిట్కాను ట్రై చేసి చూడండి, రిజల్ట్ చూసి మీరే ఆశ్చర్యపోతారు!
గమనిక: నా సొంత అనుభవంతో ఈ చిట్కా మీతో పంచుకుంటున్నాను. ఇది కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు. ఒకవేళ మీ చర్మం మరీ సెన్సిటివ్ అయితే, వాడే ముందు చేతి మీద ప్యాచ్ టెస్ట్ చేసుకోవడం మంచిది.
Source: chaipakodi.com

