షాంపూలు వాడి విసిగిపోయారా? ఒక్కసారి ఈ నీటిని తలకు స్ప్రే చేయండి, రిజల్ట్ చూసి మీరే షాక్ అవుతారు!
చుండ్రు.. ఒకసారి తలచుకుంటేనే భయమేస్తుంది కదూ! ఒకసారి ఈ సమస్య వచ్చిందంటే వదిలించుకోవడం ఎంత కష్టమో నాకైతే బాగా తెలుసు. వాతావరణం మారినా, తలలో కాస్త జిడ్డు చేరినా, ఏవైనా కొత్త షాంపూలు వాడినా.. చుండ్రు విపరీతంగా పెరిగిపోయి జుట్టు దారుణంగా రాలిపోయేది.
ఎన్నో రకాల కెమికల్ ప్రొడక్ట్స్ వాడి విసిగిపోయిన నాకు, మా ఇంట్లో వాడే ఓ అద్భుతమైన హోమ్ రెమెడీ బాగా పనికొచ్చింది. నా చుండ్రును తగ్గించి, జుట్టు ఒత్తుగా పెరిగేలా చేసిన ఆ సీక్రెట్ రెమెడీ ఏంటో మీతో పంచుకోవాలనుకుంటున్నాను.
ఈ రెమెడీ కోసం పెద్దగా ఖర్చు కూడా లేదు, అంతా మన వంటింట్లో దొరికేవే!
నేను ఎలా తయారు చేసుకున్నానంటే:
ముందుగా ఒక కప్పులో 3 స్పూన్ల బియ్యం తీసుకుని, గ్లాసు నీళ్లు పోసి ఓ 4-5 గంటలు నానబెట్టుకున్నాను. ఆ తర్వాత ఆ బియ్యం నీటిని వడగట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ఉల్లిపాయ తీసుకుని పొట్టు తీసి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.

ఒక గిన్నె తీసుకుని.. అందులో మనం పక్కన పెట్టుకున్న బియ్యం నానబెట్టిన నీళ్లు, ఉల్లిపాయ ముక్కలు, ఒక స్పూన్ వాము, ఒక స్పూన్ కాఫీ పొడి, ఒక స్పూన్ లవంగాల పొడి వేసి బాగా మరిగించాలి. మనం పోసిన నీళ్లు సగం అయ్యేవరకు మరగనివ్వాలి. ఆ తర్వాత స్టవ్ ఆపేసి, ఈ నీటిని వడగట్టి చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారాక అందులో ఒక స్పూన్ వేప నూనె కలిపాను.
ఎలా వాడానంటే:
ఈ మిశ్రమాన్ని ఒక స్ప్రే బాటిల్లో పోసుకుని, జుట్టు కుదుళ్ల దగ్గర నుంచి చివర్ల వరకు బాగా స్ప్రే చేసుకున్నాను. కచ్చితంగా అరగంట పాటు ఆరనిచ్చి, ఆ తర్వాత కుంకుడుకాయతో తలస్నానం చేశాను. షాంపూ కంటే కుంకుడుకాయ అయితేనే మంచి రిజల్ట్ ఉంటుంది.
నేను మొదట్లో వారానికి రెండు సార్లు ఇలా చేశాను. ఆశ్చర్యంగా నా చుండ్రు సమస్య చాలా వరకు తగ్గిపోయింది. చుండ్రు తగ్గాక ఇప్పుడు వారానికి ఒక్కసారి మాత్రమే వాడుతున్నాను. ఇది వాడటం మొదలుపెట్టాక చుండ్రు పోవడమే కాకుండా, నా జుట్టు రాలడం ఆగిపోయి, మునుపటి కంటే 3 రెట్లు వేగంగా, ఒత్తుగా పెరగడం గమనించాను.
ఇది ఎందుకు ఇంతలా పనిచేస్తుందంటే..
బియ్యం నీళ్లలో ఉండే లక్షణాలు జుట్టు సమస్యలన్నింటినీ తగ్గిస్తాయి. ఉల్లిపాయలో ఉండే సల్ఫర్ చుండ్రును సమర్థవంతంగా ఎదుర్కొంటుంది. ఇక లవంగాల్లో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు స్కాల్ప్ ఇన్ఫెక్షన్లను తగ్గించడానికి చాలా బాగా సహాయపడతాయి. మీరూ ఒకసారి నా ఫార్ములాను ట్రై చేసి చూడండి!
గమనిక: ఈ ఆర్టికల్లో నేను పంచుకున్న విషయాలు నా సొంత అనుభవం మరియు సాధారణ సమాచారం మేరకు రాసినవి. కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు. మీకు తీవ్రమైన చర్మ లేదా జుట్టు సమస్యలు ఉంటే నిపుణులను సంప్రదించడం మంచిది.
Source: chaipakodi.com

