Devotional

సెప్టెంబర్ నెలలో తులా రాశి వారు ఇలా ఉండకపోతే .. చాలా కష్టమే

తమకు ఈనెల ఎలా ఉండబోతోందో తెల్సుకుని,లోటుపాట్లు సరిదిద్దుకోడానికి,ఏమైనా దోష నివారణ చర్యలు తీసుకోవడానికి చాలామంది తమ రాశి ఫలితం ఎలా వుందో తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. ఇక ఇక్కడ తులా రాశి వారికి సెప్టెంబర్ మాసం లో ఎలా ఉండబోతోందో చూస్తే,గురువు ఒకటో ఇంట,శని మూడో ఇంట, కుజ – కేతువులు నాలుగో ఇంట సంచారం చేస్తున్నారు. ఇక రాహువు 10ఇంట సంచారం చేస్తున్నాడు. సమస్యల చిక్కులు, వస్తాయి. వ్యసనాలకు, ఆడంబరాలకు అధిక వ్యయం అవుతుంది. అందుకే ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలని కొందరు పండితులు సూచిస్తున్నారు.

వృత్తి , వ్యాపారాల్లో ఉన్నవారికి మనోవేదన ఉంటుంది. ఉద్యోగులు పై అధికారుల నుంచి ఇబ్బందులు పడతారు. వ్యాపారాల్లో నష్టం వస్తుంది. భార్య భర్తల మధ్య వివాదాలు,పిల్లలతో కూడా వివాదాలు ఏర్పడే ప్రమాదం ఉంది. విద్యార్థులు ఎక్కువ శ్రమిస్తే, మంచి ఫలితాలు వస్తాయి. అంతేకాదు విద్యార్థులకు నచ్చిన చోట సీట్లు వచ్చే మంచి అవకాశం కనిపిస్తోంది.

ఇక ఈ రాశి గల స్త్రీలకు మనోవేదన ఎక్కువగా ఉంటుందని అంటున్నారు.ఇక ఈ రాశివారు వాహనాలపై ప్రయాణించేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. కొత్తగా ఎక్కడైనా పెట్టుబడులు పెట్టాలనుకుంటే,వచ్చేనెల వాయిదా వేసుకుంటే మంచింది. అకాల భోజనం తగదు. ఉదర,కంటి సంబంధమైన వ్యాధులు వేదించే పరిస్థితి కనిపిస్తోంది.

ఈ రాశివారు తమకు గల ప్రతికూల పరిస్థితులను అధిగమించడానికి మంగళవారం సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధిస్తే చాలావరకూ ఉపశమనం లభిస్తుంది. అలాగే మంగళవారం దుర్గామాతను పూజించడం, దుర్గాష్టకాన్ని పఠించడం చేస్తే, సమస్యలను అధిగమించి, నరఘోషనుంచి బయట పడతారు.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."