Politics

లోకేష్ పై ఎన్టీఆర్ మామ పోటీ చేయనున్నాడా ?

నారా లోకేష్ కు మంగళగిరి స్థానం కేటాయించాడు నారా చంద్రబాబు నాయుడు . నారా లోకేష్ కోసం రకరకాల స్థానాలను తీవ్రంగా అలోచించి చివరకు మంగళగిరి ఓకే చేసారు అయితే ఇప్పుడు మరో సమస్య వచ్చి పడినట్లుంది ఎన్టీఆర్ మామ నార్నే శ్రీనివాసరావురూపంలో . జూనియర్ ఎన్టీఆర్ కు పిల్లనిచ్చిన మామ నార్నే శ్రీనివాసరావు వై ఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే .

కాగా నార్నే శ్రీనివాసరావు ని మంగళగిరి నుండి పోటీ చేయించాలని నారా లోకేష్ కు చెక్ పెట్టాలని భావిస్తున్నాడట జగన్ . నారా లోకేష్ ని కొట్టాలంటే ఎన్టీఆర్ మామే కరెక్ట్ అని భావిస్తున్నాడట జగన్ . ఒకవేళ అదే జరిగితే లోకేష్ కు ఇబ్బందే ! ఎందుకంటే కమ్మ కులం కార్డు తో పాటుగా సమీప బంధువు కాబట్టి నారా లోకేష్ విజయావకాశాలను దెబ్బ కొట్టొచ్చు అలాగే జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా ఉన్నాడు అన్న సంకేతాలను పంపొచ్చు అని ఆలోచన చేస్తున్నాడట జగన్ . ఇక నార్నే శ్రీనివాసరావు కూడా జగన్ ఆదేశిస్తే ఎక్కడి నుండైనా పోటీ చేయడానికి నేను రెడీ అని అంటున్నాడట .

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."