Movies

నయనతార గురించి మనకు తెలియని నమ్మలేని నిజాలు…. బ్యాక్ గ్రౌండ్ ఏమిటో తెలుసా?

ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి సరసన సైరా మూవీలో నటిస్తున్న నయనతార చంద్రముఖి మూవీతో తెలుగు ఆడియన్స్ కి పరిచయం అయింది. కురియన్ కొడిగట్టు,ఒమన్ కురియన్ దంపతులకు 1984నవంబర్ 18న బెంగుళూరులో జన్మించిన ఈమె తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ అయింది. కేరళ క్రిస్టియన్ కుటుంబానికి చెందిన ఈమె కు ఓ సోదరుడున్నాడు. తండ్రి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో చేసేవారు. తల్లి గృహిణి. తండ్రి ఉద్యోగం కారణంగా నయనతార స్టడీస్ వివిధ ప్రాంతాల్లో సాగింది. స్కూల్ విద్య గుజరాత్ లో సాగితే,ఇంటర్ ఢిల్లీ గర్ల్స్ కాలేజీలో,తిరువనంతపురం లో బిఎ ఇంగ్లీష్ లిటరేచర్ చేసింది. స్టడీస్ సమయంలో కల్చరల్ ఏక్టివిటీస్ లో పాల్గొనేది.

కాలేజీ డేస్ లో మోడలింగ్ చేయడంతో ఆమె ఫోటోలు చూసి మళయాళీ డైరెక్టర్ సత్యన్ తన సినిమాలో హీరోయిన్ గా చేయమని అడగడం,పేరెంట్స్ గ్రీన్ సిగ్నల్ తో వెండితెరకు ఎంట్రీ ఇచ్చింది. ఆవిధంగా మనసు నక్కరే మూవీతో మోహన్ లాల్ సరసన నటిస్తూ ఎంట్రీ ఇచ్చిన నయనతారకు మోహన్ లాల్ తన మరో రెండు సినిమాల్లో ఛాన్స్ ఇచ్చాడు. నిజానికి ఈ మూడు సినిమాలు పెద్దగా ఆడకపోయినా,నయనకు మంచి పేరువచ్చింది. అయితే ముమ్ముట్టితో చేసిన మూవీతో మంచి హిట్ కొట్టింది.

ఇక తమిళంలో చంద్రముఖి, గజినీ మూవీస్ బ్లాక్ బస్టర్ అవ్వడమే కాక తెలుగులో కూడా విడుదల కావడంతో నయనతార స్టార్ హీరోయిన్ అయింది. ఇక 2006లో ఈ,వల్లభ మూవీస్ నయనతారకు కుర్రకారులో క్రేజ్ తెచ్చాయి. అజిత్ తో కల్సి తమిళంలో చేసిన భిల్లా మూవీ సెక్సీ హీరోయిన్ గా పేరుతెచ్చింది. జూనియర్ ఎన్టీఆర్ తో అదుర్స్,రవితేజతో దుబాయ్ శ్రీను,ప్రభాస్ తో యోగి మూవీస్ మంచి పేరుతెచ్చాయి.
సీరియన్ క్రిస్టియన్ అయినప్పటికీ నయన హిందూ మతాన్ని స్వీకరించింది.

వల్లభ సినిమా సమయంలో శింబుతో లవ్ లో పడింది. శింబు కూడా కన్ఫర్మ్ చేసాడు. ఆతర్వాత ప్రేమ విఫలం అయిందని,విడిపోయామని నయన కొన్నాళ్ళకు ప్రకటించింది. ఆసమయంలో సినిమాలకు కొంతదూరం పాటించింది. అయితే మళ్ళీ ఛాన్స్ లు రావడంతో ఊపందుకుంది. ఇక తమిళంలోనే బిల్లు సినిమా సినిమా సమయంలో హీరో ప్రభుదేవాతో లవ్ లో పడింది. చాలారోజులు డేటింగ్ చేసారు. పెళ్లికూడా చేసుకోవాలని అనుకున్నా విభేదాలతో విడిపోయారు.

శ్రీరామ రాజ్యంలో నటించిన నయనతార సీతగా ఆడియన్స్ మదిలో చెరగని ముద్రవేసుకుంది. ఉత్తమ నటిగా ఫిలిం ఫేర్ ,నంది అవార్డులు గెలుచుకుంది. తులసి,సింహ,కృష్ణం వందే జగద్గురుమ్ సినిమాలతో కూడా ఆడియన్స్ ని కట్టిపడేసింది. తెలుగు ,తమిళ భాషల్లో విడుదలైన రాజారాణి మూవీ క్రేజ్ తెచ్చింది. అయితే నాగార్జునతో చేసిన గ్రీకువీరుడు బోల్తా కొట్టడంతో తెలుగులో ఛాన్స్ లు రాలేదు. కానీ తమిళ,మళయాళీ భాషల్లో దూసుకెళ్లింది.

ఆతర్వాత వెంకటేష్ తో కల్సి బాబు బంగారం మూవీ చేసి,భారీ విజయాన్ని నమోదుచేసుకుంది. 2014లో అనామిక మూవీ డిజాస్టర్ అయింది.తమిళంలో నమ్మక్కా,నోయిడా సినిమాల్లో లేడీ ఓరియంటెడ్ రోల్స్ చేసింది. 2018లో కర్తవ్యమ్ మూవీ హిట్ కాకాకపోయిన కలెక్టర్ గా ఆమె నటన చూసి 2019ఎన్నికల్లో ఈమె పోటీచేస్తుందనే వార్తలు వచ్చాయి.