రాత్రి నిద్ర పోయే ముందు కివీ పండు తింటే ఏమి అవుతుందో తెలుసా?
Kiwi Fruit benefits In Telugu :కివీ పండు అనేది ‘యాక్టినిడియా చైనిన్సెస్’ అనే తీగ జాతి మొక్కకు కాసే పండు. చైనీస్ గూస్బెర్రీస్ అని పిలిచే కివీ పండు చూడటానికి ముదురు గోధుమరంగు నూగుతో కోడి గుడ్డు ఆకారంలో ఉండి, లోపల అనేక నల్లని గింజలతో నిండిన ఆకుపచ్చ లేదా లేత పసుపు పచ్చగుజ్జు కలిగి వుంటుంది.

కివీ పండులో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఎంత ఉంటుందంటే కమలాపండుకు రెట్టింపు ఉంటుంది. కివీ పండులో పోషకాల సంగతి చూస్తే ఆపిల్ కన్నా 5 రేట్లు ఎక్కువ పోషకాలను కలిగి ఉంటుంది. కివీ పండును పండ్లలో రారాజుగా చెప్పవచ్చు. కివీ పండులో పీచు పదార్థం, విటమిన్ ఇ, పొటాషియం, ఫోలిక్ యాసిడ్, కెరోటినాయిడ్స్, యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి.

ఒక కివీ పండులో 42 క్యాలరీల శక్తితోపాటు, 64 మి.గ్రా. సి-విటమిన్, 3 గ్రా. ఎ- విటమిన్, 252 మి.గ్రా. పొటాషియం, 17 మై.గ్రా. ఫోలేట్, 2.1 గ్రా.పీచూ ఉంటాయి. కివీ పండులో ఉండే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్స్ శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతాయి. కివీ పండు తినటం వలన ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.

ఇప్పుడు వాటి గురించి వివరంగా తెలుసుకుందాం. మనం సాధారణంగా నిమ్మ, నారింజ పళ్లలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుందని మనం అనుకుంటాం. కానీ కివీలో నిమ్మ, నారింజల కంటే రెండింతలు విటమన్ సి ఉంటుంది. ఈ విటమిన్ సి.. శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్ గా పనిచేస్తుంది. దీని వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.

నిద్రలేమితో బాధపడేవారికి కివీ పండు మంచి ఔషధం అని చెప్పవచ్చు. కివీ పండులో ఉండే సెరోటొనిన్ నిద్రలేమిని పోగొడుతుంది. రాత్రి పడుకోవడానికి గంట ముందు రెండు కివీ పళ్లను తింటే హాయిగా నిద్రపోవడానికి ఎంతగానో సహాయపడుతుంది. రోజు కివీ పండును తింటే కంటికి సంబందించిన సమస్యలు రావు.

వయస్సు రీత్యా వచ్చే కంటి కణాల క్షణత కూడా తగ్గుతుంది. కివీ పండులో ఫైబర్ సమృద్ధిగా ఉండుట వలన జీర్ణ ప్రక్రియను వేగవంతం చేస్తుంది. అంతేగాక యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్ధిగా ఉండుట వలన మానసికంగా సమస్యలు తగ్గి ప్రశాంతంగా ఉంటుంది. కివీ పండు రక్తపోటు నియంత్రణలో సహాయపడుతుంది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.

