MoviesUncategorized

తెలుగు ప్లాప్ హీరోయిన్స్ కి బాలీవుడ్ ఛాన్స్ లు

ఒకప్పుడు బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వాలంటే,టాలీవుడ్ లో హిట్స్ ఇస్తూ టాప్ హీరోయిన్ గా కొనసాగుతూ ఉండాలి. ఆపై అక్కడి వాతావరణానికి అనుగుణంగా మారిపోవాలి. కానీ ఇప్పుడు ఓ మోస్తరు హిట్స్ ఇస్తూ, ఏవరేజ్ గా కెరీర్ కొనసాగించే ముద్దుగుమ్మలకు కూడా బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చేస్తున్నారు. గతంలో తెలుగుతో పాటు దక్షిణాది భాషల్లో టాప్ హీరోయిన్స్ గా రాణించిన శ్రీదేవి,జయప్రద లాంటి వాళ్ళు ఉత్తరాదిన తమ సత్తా చాటారు. మరి బాలీవుడ్ కి వెళ్లే సౌత్ ఇండియన్ భామలు,నార్త్ లో ఎలా రాణిస్తారో చూడాలి.

లై మూవీతో సిల్వర్ స్క్రీన్ మీద అడుగుపెట్టిన చెన్నై బ్యూటీ మేఘా ఆకాష్ సౌత్ లో సరైన హిట్ కోసం శ్రమిస్తోంది. అయితే శాటిలైట్ శంకర్ అనే హిందీ మూవీలో ఛాన్స్ కొట్టేసింది. సూరజ్ పంజోలి హీరోగా వస్తున్న ఈ మూవీ లో మేఘా ఆకాష్ నటిస్తోంది.

తమిళ,తెలుగు,కన్నడ భాషల్లో నటించినప్పటికీ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ కొట్టని ప్రణీత కు అనూహ్యంగా బాలీవుడ్ లో బూట్స్ సినిమాలో ఛాన్స్ కొట్టేసింది. 1971ఇండో పాక్ యుద్ధం నేపథ్యంలో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమా లో అజయ్ దేవగన్,సంజయ్ దత్, సోనాక్షి సిన్హా, పరిణితి చోప్రా లీడ్ రోల్స్ వేస్తున్నారు. ఇందులో ప్రణీత కీ రోల్ కి ఎంపికైంది.

ఇక కృతికర్బందా తెలుగు,తమిళ కన్నడ మూవీస్ లో స్టార్ హీరోలతో జోడీ కట్టినప్పటికీ సరైన హిట్ అందుకోలేదు. కొన్నితెలుగు సినిమాల్లో సపోర్టింగ్ రోల్స్ లో కూడా చేసేస్తోంది. సరిగ్గా ఈసమయంలో ఈ అమ్మడు రాజ్ రిబోతో ముంబయి వెళ్లినా, ఇంకా నిలబడలేదు.కాగా టాలెంటెడ్ యాక్ట్రస్ గా గుర్తింపు పొందిన మాళవిక బెహర్ కూడా బియాండ్ ది క్లౌడ్స్ తో బాలీవుడ్ లో అడుగుపెట్టింది. అయితే ఈ మూవీ తరువాత మాళవిక మరో ఛాన్స్ దక్కించుకోలేక పోయింది.

అలాగే అర్జున్ రెడ్డి మూవీతో యూత్ కి కనెక్ట్ అయిన షాలిని పాండే తెలుగునాట ప్రీతి శెట్టిగా పాపులర్ అయింది. తెలుగులో అంతగా రాణించలేకపోతున్న ఈమె హిందీలో పరేష్ రావెల కొడుకు ఆదిత్య హీరోగా ఎంట్రీ ఇస్తున్న బన్ ఫర్ అనే మూవీలో అఫర్ కొట్టేసింది.