Movies

జెర్సీ ఛాన్స్ మిస్ చేసుకున్న యంగ్ హీరో….కారణం ఇదే!

రెండు ప్లాప్ ల తర్వాత ఎలాగైనా హిట్ కొట్టాలన్న కసితో నేచురల్ స్టార్ నాని నటించిన జెర్సీ సినిమా అనుకున్న మేరకు హిట్ టాక్ అందుకుంది. క్రికెటర్ జీవితం ఆధారంగా గౌతమ్  డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ మూవీ గురించి ఎక్కడ చూసినా చర్చ నడుస్తోంది. టాక్ ఆఫ్ ది మూవీగా నిల్చింది. తెలుగు వాళ్ళేకాదు ఇతర భాషల వాళ్ళు కూడా ఈ సినిమా గురించి చర్చించుకుంటున్నారట. దీనికి కారణం ఇతర స్టేట్స్ లో కూడా ఈ సినిమా సత్తా చాటుతోంది. తెలుగులో స్పోర్ట్స్ డ్రామా గా ఈ సినిమా రికార్డు కెక్కింది. నాని, శ్రద్ధా శ్రీనాధ్ నటన అదిరిపోయిందని అంటున్నారు . ఎమోషన్ పండడంతో సాధారణ ఆడియన్స్ కూడా ఫిదా అవుతున్నారు. 

రెండవ సినిమా అయినప్పటికీ, డైరెక్టర్ గౌతమ్ గొప్ప సినిమా తీసి శభాష్  అనిపించుకున్నాడు. ఇంతగా హిట్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా ఛాన్స్ ని టాలీవుడ్ యువహీరో రాజ్ తరుణ్ మిస్ చేసుకున్నాడు. కెరీర్ మొదట్లో వరుస హిట్స్ తో టాలీవుడ్ ని ఓ ఊపు ఊపేసిన రాజ్ తరుణ్ కి జెర్సీలో ఓ పాత్రకు ఆఫర్ వస్తే,నో అనేసాడట. కేవలం రెండు సీన్స్ లో నటించడం కోసం రాజ్ తరుణ్ ని చిత్ర యూనిట్ సంప్రదించిందని, సినిమా ప్రారంభం,క్లైమాక్స్ లో కనిపించాల్సిన పాత్ర కావడంతో రిజక్ట్ చేసాడట.


ప్రస్తుతం రాజ్ తరుణ్ కెరీర్ డౌన్ లో ఉన్నందున , ఇలాంటి చిన్నచిన్న పాత్రలను అంగీకరిస్తే మొదటికే మోసం వస్తుందని సున్నితంగా వద్దని చెప్పేశాడట. ఇలాంటి అతిధి పాత్రలకే పరిమితం చేస్తారేమోనని జెర్సీ  ఆఫర్ ని తిరస్కరించాడట. కారణం ఏదైనా ఓ సూపర్ హిట్ మూవీలో వచ్చిన ఛాన్స్ మిస్ చేసుకున్నాడన్న మాట ఇండస్ట్రీలో వినిపిస్తోంది.