Movies

నిత్యామీనన్ పై నిషేధమా ?

మలయాళ ముద్దుగుమ్మ నిత్యామీనన్ పై నిషేధం విధించాలని కొంతమంది అదే పనిగా పట్టుబడుతున్నారు . దర్శక నిర్మాతల ఒత్తిడి ఎక్కువ కావడంతో ఆమేరకు మలయాళ చిత్ర పరిశ్రమ లోని పెద్దలు జోక్యం చేసుకొని నిత్యామీనన్ తో మాట్లాడగా గుండెలు బద్దలయ్యే నిజం తెలిసిందట ! నిత్యా మీనన్ తల్లి క్యాన్సర్ తో బాధపడుతోంది , పైగా చివరి స్టేజ్ లో ఉందని అందుకే నిత్యా సినిమా షూటింగ్ లకు రాకుండా దర్శక నిర్మాతలకు సమాచారం ఇవ్వకుండా ఇబ్బంది పెడుతోందని తెలిసిందట

తెలుగు , తమిళ , మలయాళ చిత్రాల్లో నటిస్తున్న నిత్యామీనన్ కొద్దిరోజులుగా షూటింగ్ లకు హాజరు కాకుండా , సరైన సమాధానం ఇవ్వకుండా దర్శక నిర్మాతలకు ఇబ్బందులు కలిగిస్తోందట దాంతో ఆమెపై నిషేధం విధించాలని సమావేశం ఏర్పాటు చేస్తే అప్పుడు అసలు విషయం తెలిసిందట నిత్యా తల్లి కి క్యాన్సర్ అని అందుకే కొద్దిరోజులు వేచి చూడండి అని పెద్దలు చెప్పారట . పాపం నిత్యా మీనన్ కు నిజంగానే సినిమా కష్టాలు వచ్చాయి .

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."