Movies

యస్వంత్ మాస్టర్ పెళ్లి చేసుకున్న అమ్మాయి బ్యాక్ గ్రౌండ్ ఏమిటో తెలుసా?

ఈటీవీలో ప్రసారమయ్యే డాన్స్ రియాల్టీ షో ఢీ ఎంతగా పాపులర్ అయిందో వేరే చెప్పక్కర్లేదు. ఎంతోమంది తమ సత్తా చాటేందుకు దోహదపడిన ఈ రియాల్టీ షో దోహదమైంది. సినిమాల్లో,సినీ ఫంక్షన్ లలో తన డాన్స్ ఫెరఫార్మెన్స్ తో అదరగొడుతున్న యంగ్ డాన్సర్ యస్వంత్ మాస్టర్ కూడా ఈ డాన్స్ షోలో తన సత్తా చాటారు. తాజాగా ఓ ఇంటివాడైన యస్వంత్ తన పెళ్లి విషయాన్ని instagram ద్వారా తెలిపాడు. దీంతో పెళ్లి ఫోటోలు వైరల్ అయ్యాయి. యస్వంత్ వర్ష అనే అమ్మాయిని  లవ్ చేసాడు. కాలేజీ డేస్ లోనే ఈమెను ఇష్టపడ్డాడు.

ఇద్దరి అభిరుచులు ఒక్కటవ్వడంతో లైఫ్ లో సెటిల్ అయ్యాక పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. దీనికి తోడు పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకోడానికి ఏకంగా 8ఏళ్ళు సమయం పట్టిందట.వర్ష ఇండిగో ఎయిర్ లైన్స్ లో ఎయిర్ హోస్టెస్ గా చేస్తోంది. యస్వంత్ కొరియోగ్రాఫర్ గా సెటిల్ అయ్యాడు.ఇక పెద్దలనుంచి గ్రీన్ కార్డు పడడంతో ఇప్పుడు వీళ్ళిద్దరూ శనివారం మ్యారేజ్ చేసుకున్నారు. వీళ్లిద్దరి పెళ్లి విషయం తెల్సి ఫాన్స్ కూడా చాలా సంతోషం వ్యక్తంచేస్తున్నారు. instagram లో తన భార్య వర్ష గురించి యస్వంత్ చెబుతూ వర్ష తనను లవ్ చేయడం తన లక్ అని మురిసిపోయాడు. తన భార్య చాలా మంచి అమ్మాయి అని, ఎయిర్ హోస్టెస్ గా అవ్వడానికి చాలా కష్టపడిందని చెప్పుకొచ్చాడు.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."