Movies

తినడానికి తిండి దొరక్క రమాప్రభ రజినీకాంత్ ఇంటికి వెళితే ఎం చేసాడో తెలుసా ?

ఎందరో నటులు రాజకీయాల్లోకి వచ్చారు మళ్ళీ వెనక్కి వెళ్లిపోయారు. ఎందుకంటే ఎంత అభిమానం ఉన్నా సరే,రాజకీయాల్లో రాణించాలంటే ఏదో స్పెషలాటి ఉండాలి. కేవలం ఎంజీఆర్,ఎన్టీఆర్,లాంటి వాళ్ళే పార్టీలు పెట్టి సక్సెస్ అయ్యారు. మరి తమిళనాట ఆరాధ్య దైవంగా భాసిల్లుతున్న రజనీకాంత్ అంటే బుడ్డోడు దగ్గర నుంచి వృద్ధుల వరకూ అందరూ స్పందిస్తారు. ఆరుపదుల వయస్సు ఎప్పుడో దాటిసినా ఇంకా అరవైలో ఇరవై గా ఉంటూ ఫాన్స్ ని కూడా అలా ఫీలయ్యేలా చేయడంలో రజనీకాంత్ తీరేవేరు. ఇప్పుడు రాజకీయాల్లోకి కూడా ఎంట్రీ ఇచ్చాడు. రాజకీయాల్లో ఇతనికి ఎలాంటి ఇమేజ్ వస్తుందో చూడాలి. అయితే సినిమాల్లోకి వచ్చిన కాలంలో ఓ స్లమ్ ఏరియాలో ఇరవై రూపాయలకు అద్దెకు ఉండేవాడు. 

అయితే ఆతర్వాత స్టార్ ఇమేజ్ పెరిగింది. అంచెలంచెలుగా ఎదిగిన రజనీకాంత్ ఒక్కో సినిమాకు ఇప్పుడు కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడు. రజనీతో సినిమాస్ తీస్తే, నిర్మాత ఇక చూడక్కర్లేదన్న నానుడి బాగా నాటుకుపోయింది. అందుకే 2.ఓ లాంటి భారీ బడ్జెట్ మూవీస్ అలవోకగా రజనీతో తీసేస్తున్నారు. అయితే రజనీకాంత్ కే తాను భయపడతానని రజనీ అంటారు. ఎందుకంటే ఒకప్పుడు రజనీ వేరు,ఇప్పటి రజనీ వేరని చెప్పాలి. ఒకప్పుడు సిల్క్ స్మిత లాంటి వాళ్ళతో ఎఫైర్స్ నడుపుతూ ఆకతాయిగా ఉండే రజనీ ని ఫాన్స్ దేవుడిగా చూడడం మొదలుపెట్టిన నాటినుంచి అతడి వ్యక్తిత్వం పూర్తిగా మారిపోయింది. జనం కోసం జనం మెప్పు కోరుతూ బతకాలన్న నిర్ణయానికి వచ్చేసాడు.

తన కంటికి కనిపించేవాళ్ళు కష్టాల్లో ఉండకూడదని వాళ్ళు ఆనందంగా ఉండాలని కోరుకునే వ్యక్తిత్వం ఆయనిది. రజనీకాంత్ ఎవరి ఇంటికి వెళ్లినా అక్కడ ఓ గదిలో మందు సెటప్ చేస్తారు. ఆసమయంలో అక్కడకు మందు తెచ్చిన కుర్రాడికి తన జేబులో ఎంతుంటే అంతా ఇచ్చేస్తాడు రజనీ. అదీ ఆయన స్పెషాలిటీ. తనను సాయం కోసం ఆశ్రయించే వాళ్లకు అంతోఇంతో సాయం చేసే గుణం రజనీ కి ఉండేది. ఒకరోజు డ్రైవర్ కొడుకు రజనీని చూడాలని అనుకున్నాడట. ఈ విషయం రజనీ కి తెల్సి ఓరోజు చీకట్లో డ్రైవర్ ఇంటికి వెళ్లి రజనీ వెయిట్ చేస్తున్నాడట. అది ఇంట్లో వాళ్ళు చూసి నీకోసం ఎవరో వచ్చారని డ్రైవర్ కి చెప్పడం అతడు లాటి వేసి చూసేసరికి అక్కడ రజనీ ఉండడంతో ఇంటిల్లిపాదీ ఆశ్చర్యపోయారట.

ఇంట్లోకి వెళ్లి కుర్రాడిని ముద్దు చేసి, వాళ్ళు ఉండే ఇల్లు సొంతమా,అద్దెదా అని అడిగి తెలుసుకుని మరీ ఆ ఇల్లు వాళ్ళ పేరిట కొనేశారట. అదే రజనీ వ్యక్తిత్వం. అయన అండఉంటే ఓ కొండా ఉన్నట్టే అని ఫీలవ్వాల్సిందే. ఇక శరత్ బాబుతో విడిపోయి ఉన్నదంతా పోగొట్టుకుని కట్టుబట్టలతో మిగిలిన రమాప్రభ ఓరోజు రజనీ ఇంటికి వెళ్ళింది. ఎవరు చేసుకోమన్నారు ఇలాగా, ఖర్మ అనుభవించు వంటి మాటలు మాట్లాడకుండా తన పెట్టెలోని వందనోట్లను గుప్పెట తీసి ఆమెకు ఇచ్చేసాడు. అలా ఇచ్చిన సొమ్ము అప్పట్లో అక్షరాలా 40వేలరూపాయలాట.