స్వామిజీని జగన్ కలిసింది అసలు ఎందుకో తెలుసా…అసలు విషయం ఇది
ఎన్నికల్లో ఘనవిజయం సాధించి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వైఎస్ జగన్ రాష్ట్రంలో ఆర్ధిక పరిస్థితి ఎలా ఉన్నా ,ప్రజా రంజక పాలన అందించడానికి తనవంతు ప్రయత్నం చేస్తున్నారు. పాలనలో వైవిద్యం చూపిస్తూ, తనదైన ముద్ర వేయడానికి కసరత్తు చేస్తున్నారు. శాఖల వారీగా ఉద్యోగుల తో సమావేశాలు పెడుతూ,ఆప్యాయంగా భోజనాలు పెడుతూ,’అన్నా , అన్నా చిన్నవాడిని కొంచెం సహకరించండి’అంటూ వారింట్లో మమేకమవుతున్నారు.
ఇలా ఇప్పటికే ఉద్యోగుల కళ్ళల్లో ఆనందం నింపుతున్నారు. ఇక తాజాగా విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి వారిని జగన్ కల్సి ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు. స్వామివారు చేసిన ప్రత్యేక పూజల వలన జగన్ విజయం సాధించడానికి కారణం అయిందని అందరూ అంటున్నారు. ఇక ఆయన ను కల్సి అమ్మవారికి పూజలు కూడా జగన్ చేసారు.
అయితే ఈ సందర్బంగా రాష్ట్రంలో పరిపాలన కు సంబంధించిన కొన్ని విషయాలను పర్సనల్ గా స్వామిజీతో ప్రస్తావించినట్లు తెలుస్తోంది. మంత్రివర్గ కూర్పు పై కూడా స్వామిజీతో జగన్ మాట్లాడినట్లు తెలుస్తోంది. పూజలు అయ్యాక పీఠంలోనే భోజనం చేసి అక్కడనుంచి బయలుదేరారు. ఎలాంటి అవసరం ఉన్నా తప్పకుండా కలవమని జగన్ కి స్వామిజి చెప్పినట్లు తెలుస్తోంది. అటు కేసీఆర్ కూడా స్వామిజి పట్ల అత్యంత భక్తివిశ్వాసాలు కలిగివున్నారు. దీంతో తెలుగు రాష్ట్రాల్లో స్వామీజీకి అపార గౌరవం ఏర్పడింది.

