Politics

ఎపి సీఎం జ‌గ‌న్ తినే ఫుడ్ ఎలాంటిదో తెలుసా ?

ఆంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వైఎస్ జగన్ తన దూకుడు సాగిస్తున్నారు. అధికారులతో సమీక్షలు, పాలనపై పట్టుకి బదిలీలు, మంత్రి మండలి ఏర్పాటు పూర్తయ్యాక అసెంబ్లీ తొలిసమావేశాలు కూడా జరిపించారు. నిజానికి దివంగత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో కాంగ్రెస్ లోనే రాజకీయ అరంగేట్రం చేసి,కడప ఎంపీగా అత్యధిక మెజార్టీతో నెగ్గిన జగన్ ఆతర్వాత తండ్రి మరణంతో కాంగ్రెస్ తో విభేదించి వైస్సార్ కాంగ్రెస్ పార్టీ స్థాపించారు. ఈ పదేళ్ల కాలంలో ఎన్నో పోరాటాలు చేస్తూ ఆటుపోట్లు ఎదుర్కొన్నారు. పాదయాత్ర చేసి ప్రజలతో మమేకం అయ్యారు. మొత్తానికి అనూహ్య విజయాన్ని సొంతం చేసుకుని ముఖ్యమంత్రి అయ్యారు. 

ఇక జగన్ ఫిట్ నెస్ గురించి ఇప్పుడు చర్చ జోరుగా సాగుతోంది. ఈయన తక్కువ మోతాదులో ఫుడ్ తీసుకుంటారన్న వార్తలు వైరల్ అయ్యాయి. పాదయాత్ర అన్నిరోజులు చేసినా ఎక్కడా అలసట అనేది కనిపించలేదు. దీన్నిబట్టి ఈయన లైఫ్ స్టైల్ ,ఆహారమే కారణమని చాలామంది చర్చిస్తున్నారు. నిద్ర లేవగానే జాగింగ్ ,జిమ్ చేస్తారు. తర్వాత తక్కువ మోతాదులో టీ సేవిస్తారు. ఒక లీటర్ వాటర్ ఖచ్చితంగా తాగుతారు. ఫ్రూట్ సలాడ్, జ్యూస్ అల్పాహారంగా తీసుకుంటారు. 

ఇక మధ్యాహ్నం లంచ్ లో జీడిపప్పుతో కూడిన లెమన్ రైస్ తీసుకునే జగన్, పుల్కాలు ఎక్కువగా ఇష్టపడతారు. లంచ్ లో రెండు పుల్కాలు తప్పనిసరిగా ఉండాలి. కుండలోంచి తీసిన పెరుగుని మజ్జిగ లా చేసుకుని సేవిస్తారు. సాయంత్రం ఫ్రూట్ జ్యూస్ తీసుకుంటారు. రాత్రి 8.30గంటలకు నాటుకోడి పులుసులో పుల్కా తీసుకుంటారు. కుండలో తోడుపెట్టిన పెరుగుతో చేసిన కర్డ్ రైస్ తింటారు. చిన్నతనం నుంచి ఆహారంపై శ్రద్ధ తీసుకుంటూ వస్తున్నారట.