సాయి ధరమ్ తేజ్ లైఫ్ అండ్ లవ్ స్టోరీ…హిట్స్…ప్లాప్స్…ఎన్ని ఉన్నాయో తెలుసా?
మెగా ఫ్యామిలీ నుంచి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ 1987అక్టోబర్ 15న జన్మించాడు. చిరంజీవి సోదరి విజయ దుర్గ కుమారుడైన సాయి ధరమ్ చదువులో సగటు విద్యార్థి. హైదరాబాద్ లో పదవతరగతి చదివాడు. డిగ్రీ సెయింట్ మేరీ కాలేజీలో , ఎంబీఏ ఐ ఐ బిఎం లో చదివాడు. వైవిఎస్ చౌదరి రేయ్ సినిమాతో సినీ రంగ ప్రవేశం చేసిన యితడు 2014లో పిల్లా నువ్వులేని జీవితం మూవీతో పాపులర్ అయ్యాడు. అయితే రేయ్ సినిమా ముందే స్టార్ట్ అయినా విడుదల చాలా ఆలస్యం అయింది. చిరంజీవి విషయంలో కూడా ఇలానే జరిగింది.
చిరంజీవి ,పవన్ కళ్యాణ్ లలోని పోలికలు కలగలసిన సాయి ధరమ్ తేజ్ కి పిల్లా నువ్వులేని జీవితం తర్వాత హిట్ లేక 5ఏళ్ళు గ్యాప్ వచ్చింది. చిరంజీవితో ఎన్నో పోలికల్లో ఉన్న సాయి ధరమ్ తేజ్ ఈ ఐదేళ్లలో ఎన్నో అప్ అండ్ డౌన్స్ చూసాడు. పిల్లా నువ్వులేని జీవితంతో ఆకట్టుకుని,రేయ్ మూవీతో నిరాశ పరిచాడు. ఎవడె సుబ్రహ్మణ్యం మూవీతో యంగ్ స్టార్స్ జాబితాలో చేరాడు. సుప్రీం మూవీ బాగానే ఆడడంతో రేంజ్ పెరిగింది.
ఇక తిక్క,నక్షత్రం,జవాన్,ఇంటిలిజెంట్, తేజ ఐ లవ్ యు మూవీస్ నిరాశ పరిచాయి. ఏడాదికి రెండు మూడు మూవీస్ చేయాలన్న ఆలోచనతో ఈ మెగా హీరో కొన్ని తప్పటడుగులు వేసాడు. అందుకే కెరీర్ కొంచెం దెబ్బతింది. కమర్షియల్ దిగ్గాజాల డైరెక్టర్స్ చేతిలో పడితే సాయి ధరమ్ తేజ్ ఖచ్చితంగా హిట్ మీద హిట్ కొడతాడని అంటున్నారు. ఎందుకంటే స్పీడుగా చేసి దెబ్బలు తినడం కంటే మెల్లగా చేసి,సక్సెస్ అందుకోవాలని ఫాన్స్ కోరుతున్నారు. ఇక ఈ ఏడాది వచ్చిన చిత్రలహరితో సక్సెస్ అందుకున్నాడు. ఒక సినిమా పూర్తయ్యాకే రెండో సినిమా మొదలు పెట్టాలన్న సూత్రంతో ప్రస్తుతం మారుతి డైరెక్షన్ లో ప్రతిరోజూ పండుగే చిత్రంతో రాబోతున్నాడు. ఇది వచ్చాకే తదుపరి మూవీ ఉటుందట

