Movies

సూపర్ స్టార్ కొడుకును గుర్తు పట్టారా…ఇలా ఎందుకు మారాడో ?

సినిమాలో పాత్రకు తగ్గట్టు బాడీ తో పాటు బాడీ లాంగ్వేజ్ ఇంపార్టెంట్. అందుకే నటీనటులు నటించడం కాకుండా తమ పాత్రల్లో జీవిస్తుంటారు. ఒక్కోసారి ఒకే సినిమాలో రెండు డిఫరెంట్ పాత్రలు చేయాల్సి వచ్చినప్పుడు బాడీలో రకరకాల మార్పులు తీసుకొస్తుంటారు. సిక్స్ పాక్,సైజ్ జీరో ఇలా రకరకాల యాంగిల్స్ లో మారిపోవాలి. ఇక బాలీవుడ్ లో మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ `దంగల్`లో ఒకే పాత్రలో రెండు డిఫరెన్సెస్ చూపించాడు. సిక్స్ ప్యాక్ బాడీలో కుస్తీలు పట్టేవాడిగా..అలాగే గురువు పాత్రలో బాన పొట్టతో కనిపించారు. ఆరెండు పాత్రల్లో రూపురేఖల మార్పిడి నిజంగా ఓ సాహసం,అద్భుతం అని చెప్పాలి.

పాత్ర అవసరాన్ని బట్టి శరీరాన్ని విల్లులా వంచడం, అవసరమైన చోట బొద్దుగా కనిపించడం అనేది నటుల విషయంలోనే చెల్లుతుంది. ఆ విషయంలో ఈ డెడికేషన్.. కమిట్ మెంట్ ఎలా ఉంటుందో స్పష్టమవుతోంది. తాజాగా మోహన్ లాల్ కుమారుడు ఉన్ని ముకుదన్ ఆయా పాత్రలలో ఒదిగిపోతుంటాడు. జూనియర్ ఎన్టీఆర్ కథానాయకుడిగా నటించిన జనతా గ్యారేజ్ లో కంప్లీట్ స్టార్ మోహన్ లాల్ కు రీల్ లైఫ్ లోనూ చిన్న కుమారుడి పాత్రలో నటించాడు. అలాగే అనుష్క ప్రధాన పాత్ర పోషించిన భాగమతి సినిమాలో స్వీటీకి భర్త పాత్రలో కనిపించి మెప్పించాడు.

ఉన్ని ముకుదన్ ప్రస్తుతం మలయాళం లో `మెప్పాడియన్` అనే క్రైమ్ థ్రిల్లర్ లో నటిస్తున్నాడు. ఇందు లో పాత్ర డిమాండ్ మేరకు సిక్స్ ప్యాక్ బాడీనీ ఫ్యామిలీ ప్యాక్ లోకి తీసుకొచ్చాడు. దానికి సంబంధించిన ఓ ఫోటో సోషల్ మీడియాలో జోరుగా వైలర్ అవుతోంది. మమాంగం సినిమాలో సిక్స్ ప్యాక్ లో కనిపించిన ఉన్ని ముకుందన్ ఇప్పుడు సడెన్ గా బరువెక్కిన దేహంతో, ఉబ్బెత్తిన పొట్ట తో..కరిగిపోయిన కండలతో నెటిజనులకు షాకిస్తున్నాడు. ఇది చూసి వావ్ అంటున్నారు.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."