సాయంత్రం చల్లటి గాలికి వేడివేడిగా వంకాయ బజ్జీ.. అచ్చం బండి మీద అమ్మే రుచితో ఇంట్లోనే ఈజీగా చేసేయండి!
Vankaya Bajji:వంకాయ బజ్జీ..చల్లచల్లని వాతావరణంలో వేడి వేడి బజ్జీలు తింటుంటే ఆ మజానే వేరు.ఎప్పుడు ఉల్లిపకోడి,మిరపకాయ బజ్జీలే కాకుండా అప్పుడప్పుడు వంకాయ బజ్జీలు కూడ చేసి చూడండి తప్పకుంట నచ్చుతాయి.ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం.
సాయంత్రం కాగానే వేడివేడిగా, కారంగా ఏదైనా స్నాక్ తినాలనిపిస్తుందా? అయితే బయట బండి మీద దొరికే కరకరలాడే వంకాయ బజ్జీని ఒక్కసారి ఇంట్లోనే ట్రై చేయండి. అచ్చం బయట అమ్మే రుచితో, పర్ఫెక్ట్ షేప్‌లో వచ్చే ఈ బజ్జీలు ఉల్లిపాయ, నిమ్మరసం కలుపుకుని తింటుంటే ఆ మజాయే వేరు.
బజ్జీలు ఎక్కువగా నూనె పీల్చకుండా, లోపల వంకాయ మెత్తగా ఉడికి, పైన క్రిస్పీగా రావాలంటే పిండిని ఎలా కలుపుకోవాలి? బజ్జీలు వేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. ఈ రెసిపీ ట్రై చేస్తే ఇంట్లో వాళ్లంతా కచ్చితంగా ఫిదా అయిపోతారు.
కావాల్సిన పదార్ధాలు
వంకాయలు – 3-4
శనగపిండి – 1 కప్పు
బియ్యం పిండి – 2 టేబుల్ స్పూన్స్
పసుపు – ½ టీ స్పూన్
కారం – 1 టీ స్పూన్
ఉప్పు – ½ టీ స్పూన్
ధనియాల పొడి – ½ టీ స్పూన్
వాము – ½ టీ స్పూన్
జీలకర్ర పొడి – ¼ టీ స్పూన్
బేకింగ్ సోడా – చిటికెడు
నూనె – డీప్ ఫ్రై కి సరిపడా
తయారీ విధానం
1.ముందుగా వంకాయలను వంకాయలను గుండ్రని ముక్కలుగా కట్ చేసి ఉప్పు నీళ్లలో వేసుకోవాలి.
2.ఒక మిక్సింగ్ బౌల్ లో శనగపిండి,బియ్యం పిండి,కారం,ఉప్పు,ధనియాల పొడి,జీలకర్ర పొడి,పసుపు,వాము,బేకింగ్ సోడా వేసి కలుపుకోవాలి.
3.కొద్దికొద్దిగా నీళ్లను వేసి ముద్దలు లేకుండా కలుపుకోవాలి.
4.కలుపుకున్న పిండిని పదినిమిషాలు పక్కన పెట్టుకోవాలి.
5.ఇప్పుడు డీప్ ఫ్రై కోసం ఆయిల్ వేడి చేసుకోవాలి.
6.కట్ చేసుకున్న వంకాయ ముక్కలను కలుపుకున్న పిండిలో ముంచి నూనెలో వేసుకోవాలి.
7.రెండు వైపులా తిప్పుతూ బ్రౌన్ కలర్ లోకి మారే వరకు వేపుకోని జల్లిగరిట సాయంతో ప్లేట్ లోకి తీసేసుకోవాలి.
8.అంతే వంకాయ బజ్జీ రెడి అయినట్టే.

