Broom Vastu: పొరపాటున కూడా చీపురును వంటగదిలో పెట్టకండి.. ఎందుకో తెలిస్తే షాక్ అవుతారు!
Broom in the kitchen:వాస్తు శాస్త్రం ప్రకారం వంటగదిలో చీపురు పెట్టొచ్చా లేదా అనే విషయంతో పాటు, కొత్త చీపురు ఏ రోజు కొనాలి? చీపురును ఇంట్లో ఎక్కడ దాచాలి? తదితర ముఖ్యమైన వాస్తు నియమాలను ఈ ఆర్టికల్ లో తెలుసుకోండి.
వంట గదిలో చీపురును ఉంచుకోవచ్చా.. చీపురును ఎప్పుడు కొనాలో తెలుసా.. మనం ప్రతి రోజు ఉదయం సాయంత్రం ఇంటిని శుభ్రం చేసుకోవటానికి చీపురును ఉపయోగిస్తాం. చీపురును సాక్షాత్తు లక్ష్మీదేవి గా భావిస్తాం. అందువలన చీపురును తొక్కకూడదు అని ఎలా పడితే అలా వాడకూడదని పెద్దలు చెబుతూ ఉంటారు.
చీపురును బహిరంగ ప్రదేశాలలో ఉంచకూడదు. ఎల్లప్పుడూ పశ్చిమదిశలో ఎవరికీ కనిపించకుండా ఉంచాలి. అలాగే వంట గదిలో కూడా ఉంచకూడదు. సూర్య అస్తమయం అయిన తర్వాత కూడా చీపురును ఉపయోగించకూడదు.
విరిగిపోయిన చీపురును ఇల్లు శుభ్రం చేయడానికి ఉపయోగించకూడదు. ఇలా చేయడం వలన ఇంట్లో సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అలాగే చీపురును ఎప్పుడు పడితే అప్పుడు కొనుగోలు చేయకూడదు. కృష్ణపక్షంలో కొనుగోలు చేసి శనివారం ఉపయోగించడం వల్ల ఎంతో మంచిదని వాస్తు నిపుణులు చెబుతున్నారు. అలాగే చీపురును కాళ్లతో తన్నకూడదు.
గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.
Source: chaipakodi.com

