Politics

జగన్ కి తలనొప్పి తెచ్చి పెడుతున్న రోజా వ్యాఖ్యలు

ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మూడు రాజధానుల ప్రకటన తో పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కానీ అమరావతి ప్రాంతంలో మాత్రం మూడు రాజధానుల ప్రకటన వెలువడినప్పటినుండి ఆందోళనలు వ్యక్తం చేస్తూనే ఉన్నారు. అయితే తాజాగా రోజా కారు ని నిరసన కారులు అడ్డగించిన సంగతి అందరికి తెల్సిందే. అయితే రోజా చేసిన వ్యాఖ్యలు కొత్తగా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కి ఇబ్బందిగా మారినట్లు తెలుస్తుంది.

నిరసన కారులు అడ్డుకోవడం తో నగరి ఎమ్మెల్యే రోజా వారి ఫై ఆగ్రహం వ్యక్తం చేసారు. మమ్మల్ని ఇక్కడకి రానివ్వరా? అసెంబ్లీని ఉండనివ్వరా? అని ఫైర్ అయ్యారు. అమరావతిని తరలిస్తున్నారన్న నేపథ్యంలో నిరసన చేస్తుంటే, అసెంబ్లీ ఉండనివ్వరా? అని రోజా అనడం తో ఇంకా ఆ ప్రాంత వాసుల్ని రెచ్చగొట్టినట్లుగా ఉంది. అయితే ఇప్పటికి అమరావతి ప్రాంత ప్రజల్ని, రైతుల్ని బుజ్జగించే పనిలో ఉన్న వైసీపీ ప్రభుత్వం, తాజాగా రోజా చేసిన వ్యాఖ్యలతో మరోసారి జగన్ కి ఇబ్బందిగా మారినట్లు తెలుస్తుంది. మరి ఈ విషయం లో జగన్ ఎలాంటి నిర్ణయాన్ని తీసుకుంటారో వేచి చూడాలి.