Health

ఇంట్లోనే శానిటైజర్‌ ఇలా సింపుల్ గా చేసుకోండి..! ఆ నాలుగు ఉంటే చాలు.! 15 రూపాయలు మాత్రమే

కరోనా వైరస్ ప్రపంచ దేశాలన్నింటికి వ్యాపించింది . సామాన్యుల నుండి సెలబ్రిటీల వరకు ప్రతి ఒక్కరూ కరోనా గురించి కలవరపడుతున్నారు. మన దేశంలో కరోనా సోకుతున్న వారి సంఖ్యరోజురోజుకి పెరుగుతుంది. కరోనా వైరస్ బారిన పడకుండా ఉండడానికి శుభ్రత ముఖ్యం అని డాక్టర్లు సూచించిన విషయం విధితమే. దాంతో శానిటైజర్లు, మాస్కులకు విపరీతమైన డిమాండ్‌ పెరిగింది .

ఇదే అవకాశం అని అమాంతం మాస్కులు, శానిటైజర్ల రేట్లు పెంచేశారు. మాస్కుల ఖరీదు టూ మచ్ గా పెంచేయడంతో ఇంట్లో ఉన్న ఖర్చీప్, స్కార్ఫ్ లనే మాస్కులుగా వాడుతున్న పరిస్థితి. దాంతో పాటు మార్కెట్లో శానిటైజర్ల కొరత ఏర్పడింది. స్వయంగా శానిటైజర్లను తయారు చేస్కోవడం ఎలా అనేదానిపైన ప్రజలు దృష్టి పెట్టారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) ఫార్ములాను ప్రతి ఒక్కరూ తెలుసుకుంటున్నారు.డాక్టర్లు కూడా శానిటైజర్‌లను ఎలా తయారు చేసుకోవాలనే విషయమై అవగాహన కల్పిస్తూ, ఎలా తయారు చేసుకోవాలో వీడియోలు పెడుతున్నారు. ఇప్పుడు ఎలా తయారుచేసుకోవాలో తెలుసుకుందాం.

తయారు చేసుకునేందుకు కావలసినవి:
స్వచ్ఛమైన నీరు – 90 మి.లీ.
ఐసోప్రొపైల్‌ ఆల్కహాల్‌ – 100 మి.లీ.
హైడ్రోజన్‌ పెరాక్సైడ్‌ – టేబుల్‌ స్పూన్‌
గ్లిజరిన్‌/గ్లిజరాల్‌ – టేబుల్‌ స్పూన్‌

తయారీ చేసుకునే విధానం
ముందుగా 100 మి.లీ ఐసోప్రొపైల్‌ ఆల్కహాల్‌ను శుభ్రమైన పాత్రలో తీసుకోవాలి. దీనికి టేబుల్‌ స్పూన్‌ చొప్పున గ్లిజరిన్‌, హైడ్రోజన్‌ పెరాక్సైడ్‌ కలపాలి. దీనికి 90 మి.లీ శుద్ధమైన నీరు పోయాలి. అనంతరం ఈ మిశ్రమాన్ని బాగా కలిపి ఖాళీ స్ప్రే బాటిల్‌ లేదా డిస్పెన్సింగ్‌ బాటిల్‌లో పోసి శానిటైజర్‌గా వాడుకోవచ్చు.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."