Movies

చరణ్ – తారక్ స్నేహం గురించి షాకింగ్ నిజాలు బయటపెట్టిన ప్రదీప్

యాంకర్ లలో ప్రదీప్ ది డిఫరెంట్ స్టైల్. పంచ్ డైలాగులు,ప్రాసలతో కట్టడి చేయగలడు. అందుకే బుల్లితెరమీద ఎందరో అభిమానులను సొంతం చేసుకున్నాడు. కొంచెం టచ్ లో ఉంటె చెబుతా వంటి షో తో ఎందరో టాలీవుడ్ సెలబ్రిటీలకు దగ్గరయ్యాడు. వెండితెరపై అప్పుడప్పుడు మెరిశాడు కూడా. ఢీ షోకి యాంకర్ గా తీరికలేకుండా ఉండే ప్రదీప్ ప్రతి పండక్కి స్పెషల్ ఈవెంట్ లో మెరుస్తాడు.

ఇక బుల్లితెరపై వెలగడానికి హీరోగా కూడా సిల్వర్ స్క్రీన్ పై ఎంట్రీ ఇస్తున్నాడు. నీలి నీలి ఆకాశం అనే ఒక్కపాటతో 30రోజుల్లో ప్రేమించడం ఎలా అని మూవీ అంచనాలు పెంచేసింది. చంద్రబోస్ రాసిన ఈ పాట ప్రదీప్ ని ఎక్కడికో తీసుకెళ్ళిపోయిందని చెప్పాలి. సోషల్ మీడియాను ఊపేసిన ఈ సాంగ్ బాగా క్లిక్ కావడంతో మూవీ ప్రమోషన్స్ ని కూడా అదరగొట్టేస్తున్నారు. అయితే ప్రమోషన్ లో భాగంగా కొంచెం టచ్ లో ఉంటె చెబుతా షో గురించి చెప్పాడు.

ఈ షోకి రావాలని అడిగిన వెంటనే సమంత ఒకే చెప్పిందని, మేకప్ కిట్ తానే తెచ్చుకుందని, మూడు గంటలపాటు షూట్ చేశామని చెప్పాడు. త్రివిక్రమ్,పవన్ కళ్యాణ్,సునీల్,రామ్ చరణ్,ఎన్టీఆర్ స్నేహం చూస్తే ముచ్చటగా ఉంటుందని చెప్పాడు. ఎన్టీఆర్ తో ఉంటె అద్భుతమని,ఎంతోసరదాగా మాట్లాడతాడని చెప్పాడు. చెర్రీ తో కాసేపు మాట్లాడితే అతడు మెగాస్టార్ కొడుకేనా, మెగా పవర్ స్టార్ రామ్ చరణేనా అనిపిస్తుందని ప్రదీప్ చెప్పుకొచ్చాడు

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."