Movies

రీ ఎంట్రీకి సిద్ధం అవుతున్న భామలు..ఎవరు సక్సెస్ అవుతారో ?

హీరోయిన్స్ తెలుగులో మంచి పొజిషన్ లో ఉండగానే గ్యాప్ తీసుకోవడం సహజం. అయితే కొందరు పెళ్లి చేసుకొని సెటిల్ అయితే,కొందరు లవ్ లో పడి ఇండస్ట్రీకి దూరంగా జరిగితే,మరికొందరు వేరే భాషా చిత్రాల్లో నటిస్తూ తెలుగుకి దూరం అయ్యారు. ఇలాంటి వాళ్లలో కొందరు ఇప్పుడు తెలుగులో రీ ఎంట్రీ ఇస్తున్నారు. చాలాకాలం తర్వాత తెలుగులో నటించడానికి సంతకం చేసారు. మల్లీశ్వరి మూవీతో తెలుగులో ఎంట్రీ ఇచ్చిన కత్రినా కైఫ్ విక్టరీ వెంకటేష్ తో జోడీకట్టి హిట్ అందుకుంది. 2005లో బాలయ్య తో కల్సి అల్లరి పిడుగులో నటించి, ఆతరువాత బాలీవుడ్ లో బిజీ అయిపొయింది.

ప్రభాస్ 21వ మూవీ కి మహానటి ఫేమ్ నాగ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రభాస్ సరికొత్త పాత్రలో కనిపించనున్న ఈ మూవీని వైజయంతి మూవీస్ పతాకంపై అశ్విని దత్ నిర్మిస్తున్నారు. ఇందులో కత్రినా హీరోయిన్ అనే ప్రచారం జోరందుకుంది. అదే నిజమైతే కత్రినా రీ ఎంట్రీ అయినట్లే కదా. గబ్బర్ సింగ్, రేసుగుర్రం,శ్రీమంతుడు, ప్రేమమ్ వంటి మూవీస్ తో హిట్స్ సాధించి, శృతిహాసన్ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. కమలహాసన్ కుమార్తె అయినా తనకంటూ ఓ ఇమేజ్ తెచ్చుకుంది. 2017లో పవన్ కళ్యాణ్ తో వచ్చిన కాటమరాయుడు తెలుగులో ఆమె చివరి సారిగా కనిపించింది.

ఇక ఇప్పుడు మాస్ మారాజు రవితేజ హీరోగా వస్తున్నా క్రాక్ మూవీలో శృతి హీరోయిన్ గా కనిపించబోతున్నట్లు వార్తలొస్తున్నాయి. గోపీచంద్ మలినేని డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నాడు. అలాగే ప్రియమణి పెళ్లయిన కొత్తలో ,యమదొంగ,శంభో శివశంభో, గోలీమార్,రగడ వంటి మూవీస్ తో హిట్స్ అందుకుంది. ఇప్పుడు విరాటపర్వం మూవీకి సంతకం చేసిందట. తమిళంలో జయలలిత బయోపిక్ లో సైతం ఈ భామ కనిపించబోతోంది. వెంకటేష్ నారప్ప మూవీలు హీరోయిన్ పాత్రకోసం ప్రియమణిని సంప్రదించారట. అమలాపాల్ కూడా ఓ రీమేక్ మూవీలో ప్రధాన పాత్రకు ఎంపికైంది. ఎన్నో హిట్స్ అందుకుని చిత్రాంగద మూవీ తరువాత తెలుగుకి దూరంగా ఉన్న అంజలి నిశ్శబ్దం మూవీతో ఆడియన్స్ ముందుకి వస్తోంది. పవన్ వకీల్ సాబ్ లో కూడా కీలక పాత్రకు ఎంపికైంది.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."