Movies

బాలకృష్ణ కు ధన్యవాదాలు చెప్పుకున్న చిరంజీవి – డియర్ బ్రదర్ అంటూ ఆప్యాయ పలకరింపు…

నందమూరి బాలకృష్ణ పై మెగాస్టార్ చిరంజీవి తాజాగా ప్రశంసల వర్షాన్ని కురిపిస్తున్నారు. కాగా ప్రస్తుతానికి మన దేశం అంత కూడా భయంకరమైన కరోనా వైరస్ పై ఒక రకమైన పోరాటాన్ని చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. అయితే భయంకరమైన కరోనాని కట్టడి చేయడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఈ మేరకు పలువురు సినీ, రాజకీయ, వ్యాపార రంగ సంస్థల ప్రముఖులు అందరు కూడా తమకు తోచినంత విరాళాన్ని ప్రకటిస్తున్నారు. దానికి తోడు ఈ లాక్ డౌన్ వలన కొంతమంది సినీ కార్మికులకు కూడా గత కొద్దీ రోజులుగా పని లేకుండా పోయింది. అందుకు గాను ప్రత్యేకంగా మెగాస్టార్ చిరంజీవి ఆధ్వర్యంలో కరోనా క్రైసిస్ ఛారిటీ ఏర్పాటు చేయడం జరిగింది.

అయితే చిరంజీవియేర్పాటు చేసిన ఈ చారిటీ కి ప్రముఖనటుడు నందమూరి బాలకృష్ణ రూ.25 లక్షల విరాళం ప్రకటించారు. అంతేకాకుండా రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలకు చెరో రూ.50 లక్షలు చెప్పున మొత్తంగా కోటీ రూపాయల విరాళాన్ని ప్రకటించారు. అయితే బాలకృష్ణ చేసిన విరాళానికి మెచ్చుకున్న చిరంజీవి అధికారిక ట్విట్టర్ వేదిక ద్వారా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకున్నారు. కాగా “నా ప్రియమైన సోదరుడు బాలకృష్ణ రూ. 1 కోటి 25 లక్షల రూపాయల విరాళం అందించడం సంతోషంగా ఉందన్నారు. ప్రజలకు కష్టమొచ్చిన ప్రతి సమయంలో సినీ నటులు అంతా ఒక్కటిగా ముందుకు వస్తుంది. మీ అండదండలు సినీ పరిశ్రమకు ఉండాలని” చిరంజీవి వాఖ్యానించారు.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."