Movies

షాకింగ్ నిర్ణయం తీసుకున్న చిరంజీవి…చాలా స్పీడ్ గా ఉన్నాడు

మెగాస్టార్ చిరంజీవి టాలీవుడ్ లో 151 సినిమాలు పూర్తి చేశారు. కొరటాల శివ దర్శకత్వంలో 152 సినిమా అయిన ఆచార్య చిత్రంలో నటిస్తున్నారు. అయితే లాక్ డౌన్ కారణంగా ఇంటివద్దనే ఉంటున్న చిరు యువ దర్శకులతో చర్చలు జరుపుతున్నారు. అయితే వరుసగా బాబీ, మెహర్ రమేష్ లతో కూడా సినిమా చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే సుకుమార్, పరశురామ్ లతో కూడా చర్చలు జరుగుతున్నాయి. అయితే ఈ నేపధ్యంలో మెగాస్టార్ చిరంజీవి ఒక ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. అవకాశం వస్తె వెబ్ సిరీస్ లలో ఖచ్చితం గా నటిస్తాను అని వ్యాఖ్యానించారు.అయితే ఇపుడు మెగాస్టార్ మాత్రం ప్రస్తుతం చేస్తున్న సినిమా ల పైనే శ్రద్ద ఉంచినట్లు తెలిపారు.

అయితే ఈ వెబ్ సీరీస్ ట్రెండ్ టాలీవుడ్ కి కూడా చేరింది. అక్కినేని కోడలు, అగ్ర తార సమంత ది ఫ్యామిలీ మాన్ వెబ్ సేరీస్ కి కొనసాగింపు గా వస్తున్న సీరీస్ లో నటిస్తుంది. అయితే ఇది త్వరలో విడుదల కానుంది. అయితే ఇండియా లో కూడా ఈ వెబ్ సిరీస్ ల హవా నడుస్తూ ఉండటం తో మెగాస్టార్ చిరంజీవి సైతం వీటి పై ఆసక్తి చూపుతున్నారు. మరి లాక్ డౌన్ అయ్యాక చిరు ను మెప్పించే ఆ దర్శకుడు ఎవరో చూడాలి. చిరు మాత్రం ప్రస్తుతం ఆచార్య చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సంగీతం దేవిశ్రీప్రసాద్ అందిస్తున్నారు.