Movies

ప్రదీప్‌ మూవీకి వాళ్లు డబుల్‌ రేటు ఇస్తామంటున్నారట…నిర్మాతలు ఏమి చేస్తున్నారో…?

యాంకర్‌గా బుల్లి తెరను షేక్‌ చేసి, ఇంకా చేస్తూనే ఉన్న ప్రదీప్‌ హీరోగా ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయిన విషయం తెల్సిందే.30 రోజుల్లో ప్రేమించడం ఎలా చిత్రంతో ప్రదీప్‌ హీరోగా పరిచయం కాబోతున్నాడు.నీలి నీలి ఆకాశం అంటూ ఒక్కసారిగా తన సినిమాపైకి అందంరి దృష్టిని ఆకర్షించిన ప్రదీప్‌ ఖచ్చితంగా సినిమాతో సూపర్‌ హిట్‌ కొడతాడని అంతా అనుకున్నారు.కాని అనూహ్యంగా సినిమా విడుదలకు ముందు లాక్‌డౌన్‌ ప్రారంభం అయ్యింది.మరో వారం రోజుల్లో ప్రేక్షకుల ముందుకు సినిమా రాబోతుంది అనగా ఈ పరిస్థితి ఏర్పడినది.

లాక్‌డౌన్‌ కారణంగా సినిమాను విడుదల చేయలేని పరిస్థితి.లాక్‌డౌన్‌ తర్వాత అయినా కూడా చాలా సినిమాలు విడుదల విషయంలో క్లారిటీ లేదు.వచ్చే ఏడాది వరకు సినిమాల విషయంలో నమ్మకం పెట్టుకోవద్దంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.అందుకే పలు సినిమాలను నేరుగా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ల మీద విడుదల చేసేందుకు మేకర్స్‌ సిద్దం అయ్యారు.ఇప్పటికే కొన్ని సినిమాలు ఓటీటీపై దున్నేస్తూ ఉంటే మరికొన్ని సినిమాలు కూడా ఓటీటీలో ప్రసారం అవుతాయని అనుకుంటున్నారు.

సినీ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం ప్రదీప్‌ నటించిన 30 రోజుల్లో ప్రేమించడం ఎలా సినిమాను బడ్జెట్‌కు డబుల్‌ రేటు ఇచ్చి కొనుగోలు చేసేందుకు అమెజాన్‌ ప్రైమ్‌ మరియు నెట్‌ప్లిక్స్‌లు రెడీగా ఉన్నాయట.అయితే నిర్మాతలు మాత్రం సినిమాకు ఉన్న బజ్‌ నేపథ్యంలో సినిమాను థియేటర్లలో విడుదల చేస్తేనే బాగుంటుందని భావిస్తున్నారట. బడ్జెట్‌కు డబుల్‌ రేటు ఇవ్వడంతో పాటు శాటిలైట్‌ మరియు ఆన్‌ లైన్‌ రేట్లు అదనంగా నిర్మాతలకు వస్తాయి.అంటే 10 కోట్లు పెట్టుబడి పెడితే 30 కోట్లు వస్తాయన్నమాట.

అంటే 20 కోట్ల లాభంగా విశ్లేషకులు చెబుతున్నారు.అయినా కూడా ఇంకా ఎక్కువ వస్తాయనే ఉద్దేశ్యంతో నిర్మాతలు ఈ సినిమాను ఓటీటీకి ఇచ్చేందుకు ఒప్పుకోవడం లేదట.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."