‘పుష్ప’లో రష్మిక కు అంతగా సీన్ ఉండదా…అయ్యో పాపం ఇరుక్కుపోయిందిగా
డైరెక్టర్ సుకుమార్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ల కాంబినేషన్ లో ‘పుష్ప’ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెల్సిందే. అయితే ఈ చిత్రంలో హీరోయిన్ గా రష్మిక మందన్న ఇప్పటికే ఎంపిక చేయగా, కేవలం ఈ మూవీ కోసమే రష్మిక చిత్తూరు యాస కూడా నేర్చుకుంటున్నట్లు, మాస్ లుక్ లో గిరిజన బాలిక లుక్ లో రష్మిక కనిపించ బోతున్నట్లు టాక్.ఇక ఈ సమయంలో సినిమాలో మెయిన్ విలన్ పాత్రకు బాలీవుడ్ స్టార్ నటుడిని నటింపజేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలుస్తోంది.
లాక్ డౌన్ ఎత్తివేసిన వెంటనే సినిమా కేరళలో చిత్రీకరించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ఇదే సమయంలో ఈ సినిమాకు సంబంధించి మరో ఆసక్తికర వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అదేమిటంటే, .. పుష్పలో అల్లు అర్జున్ ,రష్మిక మద్య ఎలాంటి రొమాంటిక్ ట్రాక్ ఉండదట. కమర్షియల్ ఎలిమెంట్స్ కోసం బన్నీకి జోడీగా మరో హీరోయిన్ ను సుకుమార్ ఎంపిక చేయబోతున్నట్లు ప్రచారం సాగుతోంది.
రష్మిక పాత్రకు కథలో చాలా ప్రాముఖ్యత ఉన్నా కూడా బన్నీకి జోడీగా ఇద్దరి మద్య రొమాంటిక్ సీన్స్ ఉండవని దీన్నిబట్టి అర్ధం అవుతోంది. ఇప్పటికే ఈ సినిమాలో మరో హీరోయిన్ పాత్ర కోసం నివేధా థామస్ తో చర్చించారని టాక్ నడుస్తోంది. ప్రస్తుతం టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా వరుస హిట్స్ కొడుతున్న ముద్దుగుమ్మ రష్మిక ఇలా మరో హీరోయిన్ తో స్క్రీన్ పంచుకోవడం కొందరికి అసలు నచ్చడం లేదు. బన్నీతో రొమాంటిక్ సీన్స్ లేకుండా కూడా పుష్ప చిత్రం రష్మికకు తప్పకుండా మంచి పేరు తెస్తుందని చిత్ర బృందం ఆశగా ఉంది.
