Movies

ఒకప్పటి హీరోయిన్ ని గుర్తు పట్టారా…ఇప్పుడు ఏమి చేస్తుందో తెలుసా?

చాలామంది హీరో హీరోయిన్స్ వస్తుంటారు వెళ్తుంటారు కానీ ఆడియన్స్ మదిలో చెరగని ముద్ర వేసుకునేవాళ్ళు కొందరే. అయితే మరికొందరు తక్కువ సినిమాలు చేసినా ఆణిముత్యాల్లాంటి సినిమాలు కావడంతో చాలాకాలం గుర్తుంటారు. ఇప్పుడు మనం ప్రస్తావించే హీరోయిన్ బాలీవుడ్ బ్యూటీ “షమిత శెట్టి”గురించి. ఈమె టాలీవుడ్ ప్రముఖ స్వర్గీయ దర్శకుడు కోడి రామకృష్ణ దర్శకత్వం వహించిన “పిలిస్తే పలుకుతా.!” చిత్రంలో హీరోయిన్ గా నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇప్పటికే తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. నిజానికి ఈమె తెలుగులో ఒకే ఒక్క చిత్రం నటించినప్పటికీ తన నటనతో ప్రేక్షకులని బాగానే అలరించింది.

అంతేకాక ఈ చిత్రంలోని “మనసా ఒట్టు మాటాడొద్దు” అనే పాట ఇప్పటికీ చాలామందికి ఫేవరెట్ సాంగ్ గా మిగిలిపోయింది. ఈ అమ్మడు తెలుగు, తమిళం, హిందీ, మలయాళం తదితర భాషలలో కలిపి దాదాపుగా 20 కి పైగా చిత్రాలలో హీరోయిన్ గా నటించింది.అలాగే 2009వ సంవత్సరంలో బాలీవుడ్ బిగ్ బాస్ మూడవ సీజన్ లో కూడా కంటెస్టెంట్ గా పాల్గొంది. ఇక ఈ అమ్మడికి ప్రస్తుతం 40 ఏళ్ళు దాటినప్పటికీ ఎందుకు పెళ్లిపై ఆసక్తి లేదు. అలాగని సినిమాలపై కూడా పెద్దగా దృష్టి లేదు.

ఈ అమ్మడు ఒకప్పుడు బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా వెలుగొందిన జీరో సైజ్ నడుము సుందరి శిల్పా శెట్టి చెల్లెలని ఇప్పటికీ చాలా మందికి తెలియదు.అయితే ప్రస్తుతం షమితా శెట్టి ముంబైలోని తన సొంత నివాసంలో ఉంటోందట. ఈ అమ్మడి చేతిలో సినిమా ఛాన్స్ లు లేకున్నా పలు రకాల ఫోటో షూట్ సంస్థలు నిర్వహిస్తున్న ఫోటో షూట్ కార్యక్రమాలలో పాల్గొంటూ ఫోటోలకు ఫోజులు ఇస్తోంది. అలాగే ఈ ఫోటోలను సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తూ ఫాన్స్ ని అలరిస్తోంది.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."