MoviesTollywood news in telugu

ఒక్క సినిమా నష్టం 15సినిమాలతో పూడ్చిన వైనం…ఏ సినిమా…అంత నష్టమా… ?

Tollywood Hero Sai Kumar:డబ్బింగ్ ఆర్టిస్టుగా టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చి ఎంతోమందికి డబ్బింగ్ ఇచ్చిన సాయికుమార్ క్యారెక్టర్ ఆర్టిస్టుగా, విలన్ గా చేసి,1996లో వచ్చిన పోలీస్ స్టోరీ సినిమాతో నటుడు సాయి కుమార్ హీరోగా అవతరించాడు.

సీరియస్ అండ్ సిన్సియర్ పోలీస్ అధికారి పాత్రలో జీవించిన సాయి కుమార్ నటనను ఎన్నేళ్లు గడిచినా మదిలోనే ఉంటుంది. ఇక ఆ సినిమాలోని డైలాగ్స్ ఇప్పటికీ ఫేమస్సే. ఆ మూవీతో వచ్చిన ఇమేజ్ తో సాయి కుమార్ వరుసగా యాక్షన్ చిత్రాలు చేశారు. అయితే ఒక మూవీ వలన సాయి కుమార్ 2 కోట్ల అప్పు మిగిలింది. దాన్ని తీర్చడానికి ఏకంగా 15 సినిమాలు చేశారట.

అందులో 1998లో వచ్చిన ఈశ్వర్ అల్లా కూడా ఒకటి. కాగా ఆ సినిమా వలన నటుడు సాయి కుమార్ ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఈ విషయాన్ని ఇటీవల సాయికుమార్ గుర్తుచేసుకున్నారు. అప్పట్లోనే 2 కోట్ల భారీ బడ్జెట్ తో ఆ చిత్రాన్ని తన తమ్ముడు అయ్యప్ప శర్మ దర్శకత్వంలో తెరకెక్కించారు. సాయి కుమార్ మార్కెట్ లెక్క ప్రకారం అంత వసూళ్లు రాబడుతోందో లేదో తెలియదు.

అయితే ఆ మూవీలో సాయి కుమార్ తండ్రి పీజే శర్మ విలన్ గా నటించంతో కాంబినేషన్ క్రేజ్ వలన మూవీ ఆడుతుందని భావించి ఆ మూవీ తెరకెక్కించారట. తీరా ఆ సినిమా చూసిన బయ్యర్లు కొనడానికి ముందుకు రాలేదు.

పీజే శర్మ విలన్ కావడంతో సాయి కుమార్ క్లైమాక్స్ లో కొట్టే సీన్ ఉంది. దాన్ని ప్రేక్షకులు జీర్ణించుకోలేరని డిస్ట్రిబ్యూటర్స్ జంకారు. చివరకు దర్శకరత్న దాసరి నారాయణరావు చొరవతో ఆ మూవీ విడుదల కాగా, డిజాస్టర్ అయింది. దాంతో 15మూవీస్ చేస్తే గానీ ఆ నష్టం పూడ్చలేకపోయారట.