Movies

బాల కృష్ణ మొదటి సినిమా “తాతమ్మ కల” గురించి ఈ విషయాలు మీకు తెలుసా ?

నందమూరి నటవారసుడిగా బాలకృష్ణ ఎన్నో సూపర్ హిట్ చిత్రాలతో అలరించి,ఫ్యాన్ ఫాలోయింగ్ తెచ్చుకున్నాడు. హిట్ ప్లాప్ లతో సంబంధం లేకుండా అభిమానించే అభిమానులు బాలయ్యకే సొంతం. గతంలో సింహా, లెజెండ్ చిత్రాలతో విజయం అందుకున్న బాలయ్య ,బోయపాటి శ్రీను కాంబోలో ప్రస్తుతం ఓ సినిమా వస్తోంది. ఇక ఆగస్టు 30అనగానే బాలయ్య జీవితంలో మరపురాని రోజు. పుట్టిన రోజు జూన్ 10కి ఎంత విలువ ఉందొ ఆగస్టు 30కి కూడా అంతే విలువ ఉంది.

తెలుగు సినిమా లెజెండరీ స్టార్ నటరత్న ఎన్టీఆర్ నటించి దర్శకత్వం వహించిన తాతమ్మ కల మూవీలో బాల నటుడిగా ఎంట్రీ ఇచ్చిన రోజు ఆగస్టు 30. తండ్రి ఎన్టీఆర్,అన్న హరికృష్ణతో స్క్రీన్ షేర్ చేసుకుని 14ఏళ్ళ ప్రాయంలో బాలయ్య నటించిన తొలిసినిమా ఇది. అందుకే ఫాన్స్ కి కూడా ఈ సినిమా ఇష్టం.

తాతమ్మకల 1974 ఆగస్టు 30న రిలీజై ఇప్పటికి 46ఏళ్ళు పూర్తిచేసుకుంది. దీంతో బాలయ్య నట కెరీర్ కి 46ఏళ్ళు పూర్తయ్యి,మరో నాలుగేళ్లలో 50యియర్స్ పూర్తిచేసుకోబోతున్నాడు. తాతమ్మ కల మూవీలో టైటిల్ రోల్ వేసిన భానుమతి మనవడిగా మంగమ్మగారి మనవాడి మూవీలో బాలయ్య నటించాడు. ఆ సినిమా బ్లాక్ బస్టర్ కొట్టింది.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."