Healthhealth tips in telugu

Weight Loss:బరువు తగ్గించుకోవటానికి కొబ్బరి నూనెను ఎలా వాడాలి ?

Weight Loss:మనం ఉత్తమమైన కొబ్బరి నూనె మరియు దాని ప్రభావం గురించి వివరంగా తెలుసుకున్నాం. అయితే ఇప్పుడు బరువు కోల్పోయి చక్కని శరీరం ఎలా పొందాలోతెలుసుకుందాం. బరువు కోల్పోవటానికి కొబ్బరి నూనె ఎలా సహాయపడుతుందోతెలుసుకుందాం.

1. ప్రతి రోజు కొబ్బరి నూనె వినియోగం
మనం బరువు కోల్పోవటానికి మరియు అదే సమయంలో బరువు పెరగకుండా ఉండాలంటే కొబ్బరి నూనెను ఉపయోగించటం ఉత్తమమైన పద్దతి అని చెప్పవచ్చు.

కావలసినవి
సేంద్రీయ కొబ్బరి నూనె – 2 నుంచి 3 స్పూన్స్

పద్దతి
1. కొబ్బరి నూనె సీసాను తీసుకోని వేడి నీటిలో పెడితే నూనె కరుగుతుంది.
2. ప్రతి రోజు భోజనం ముందు 2 లేదా 3 స్పూన్ల కొబ్బరి నూనెను తీసుకోవాలి.
3. మనం తీసుకొనే 3 స్పూన్ల కొబ్బరి నూనెను మూడు బాగాలుగా చేసి, ఒక స్పూన్ బ్రేక్ ఫాస్ట్ ముందు,ఒక స్పూన్ లంచ్ ముందు,ఒక స్పూన్ డిన్నర్ ముందు తీసుకోవచ్చు.

2. కొబ్బరి నూనె, నిమ్మరసం మరియు వేడి నీరు
నిమ్మరసంలో విటమిన్ C సమృద్దిగా ఉండుట వలన జీవక్రియను ప్రోత్సహించటమే కాకుండా మూత్రపిండాలు మరియు కాలేయంల నుండి విషాన్ని బయటకు పంపుతుంది. ఈ విధంగా విషాలు బయటకు వెళ్ళటంతో సహజంగానే బరువు తగ్గటానికి ప్రోత్సాహం కలుగుతుంది. అంతేకాక నిమ్మలో ఉండే యాంటి బాక్టీరియా మరియు యాంటి వైరల్ లక్షణాలు మనల్ని ఫీట్ గా ఉంచేందుకు సహాయపడతాయి.

అదే సమయంలో వేడి నీరు కూడా మన శరీరాన్ని హైడ్రేడ్ గా ఉంచి విషాలను బయటకు పంపటంలో సహాయపడుతుంది. నిమ్మరసం,కొబ్బరి నూనె రెండు కలిసినప్పుడు బరువు తగ్గించటంలో అత్యంత ప్రభావవంతంగా పనిచేస్తాయి.

కావలసినవి
కరిగించిన సేంద్రీయ కొబ్బరి నూనె – 1 టేబుల్ స్పూన్
నిమ్మకాయ – సగం
వేడి నీరు – 1 గ్లాస్

పద్దతి
1. ఒక గ్లాస్ వేడి నీటిని తీసుకోవాలి.
2. దానిలో ఒక స్పూన్ కొబ్బరి నూనె, సగం నిమ్మ చెక్క రసం వేసి బాగా కలపాలి.
3. ఈ పానీయాన్ని త్రాగాలి. ఇది బరువు కోల్పోవటంలో చాలా సమర్ధవంతంగా పనిచేస్తుంది.

3. కొబ్బరి నూనె మరియు తేనె
బరువు కోల్పోవటానికి సమర్ధవంతంగా పనిచేసే పదార్దాలలో తేనే ఒకటి. తేనే వినియోగం వలన జీవక్రియ వేగం పెరిగి సమర్థవంతంగా కొవ్వు కరగటానికి సహాయపడుతుంది. అంతేకాకుండా జీర్ణ ప్రక్రియను ప్రోత్సహించి బరువు
తగ్గటానికి సహాయం చేస్తుంది.

కావలసినవి
కరిగించిన సేంద్రీయ కొబ్బరి నూనె – 1 నుంచి 3 స్పూన్స్
తేనే – 1 స్పూన్
వేడి నీరు – 1 గ్లాస్

పద్దతి
1. ఒక గ్లాస్ వేడి నీటిలో తేనే మరియు కొబ్బరి నూనె కలపాలి.
2. అన్ని పదార్దాలు బాగా కలిసేలా కలిపి త్రాగాలి.
3. ఈ పానీయాన్ని ఉదయం ఒక్క సారి, సాయింత్రం ఒక్క సారి తీసుకుంటే బరువు
కోల్పోయే ప్రక్రియ వేగవంతం అవుతుంది.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."