Kitchenvantalu

Veg Manchuria:వెజిటబుల్ మంచురియా చాలా సాఫ్ట్ గా, టేస్టీగా రావాలంటే ఇలా చేయండి

Veg Manchuria:వెజిటబుల్ మంచురియా చాలా సాఫ్ట్ గా, టేస్టీగా రావాలంటే ఇలా చేయండి.. మీరు శాకాహారులైతే.. రెస్టారెంట్ స్టైల్ లో రుచికరమైన వెజ్ మంచూరియాను ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు.. ఈవెజ్ వెజ్ మంచూరియాను అలాగే చిరు తిండిగా తినవచ్చు..

కావలసిన పదార్దాలు :
క్యాబేజి, క్యారెట్‌ తరుగు- రెండు కప్పుల చొప్పున
ఉల్లిపొరక తరుగు – కప్పు
పచ్చిమిర్చి – రెండు (సన్నగా తరగాలి)
సన్నగా తరిగిన వెల్లుల్లి పలుకులు – రెండు చెంచాలు
మొక్కజొన్నపిండి- అరకప్పు
సోయాసాస్‌ – చెంచా
ఉప్పు – రుచికి సరిపడా
మిరియాలపొడి, పంచదార- చెంచా చొప్పున
అజినోమోటో – చిటికెడు
నూనె – వేయించేందుకు సరిపడా

తయారి విదానం:
క్యాబేజి, క్యారెట్‌ ముక్కల్ని కలిపి.. గట్టిగా పిండితే నీరు పోతుంది. వీటికి మొక్కజొన్నపిండి, ఉప్పు చేర్చి గట్టిగా కలపాలి. సాధ్యమైనంత వరకు నీరు అవసరం లేదు. ఈ పిండిని చిన్నచిన్న ఉండల్లా చేసి నూనెలో బంగారువర్ణంలోకి వచ్చేదాకా వేయించాలి.

ఇప్పుడు అదే బాణలిలో రెండుచెంచాల నూనె వేడిచేసి వెల్లుల్లి పలుకులు, పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపొరక ముక్కలు వేయించాలి. కొద్దిగా నీళ్లుపోసి ఉప్పు, మిరియాలపొడి, అజినోమోటో, పంచదార, సోయాసాస్‌ కలపాలి. ఐదు నిమిషాలయ్యాక ముందుగా వేయించిపెట్టుకున్న ఉండల్ని ఈ మిశ్రమంలో వేయాలి. సన్నని మంటపై ఉంచి కలుపుతూ ఉండాలి. ఐదారు నిమిషాలయ్యాక దింపేయాలి. సర్వ్‌ చేసేముందు ఉల్లిపొరక ముక్కలు, కొత్తిమీర తరుగుతో అలంకరిస్తే సరిపోతుంది.

మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
https://www.chaipakodi.com/

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."