పుషక విమానం సినిమా గురించి కొన్ని నమ్మలేని నిజాలు…అసలు నమ్మలేరు
pushpaka vimanam telugu full movie :ఎప్పుడో భాగ్యరేఖ సినిమా షూటింగ్ టైమ్ లో కెవిరెడ్డి చెప్పిన చీకట్లో డైలాగ్ లేకుండా సీన్ మదిలో మెదిలి అసలు మాటలే లేకుండా సినిమా తీయాలని డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు ఆలోచన. అది నెరవేరడానికి చాన్నాళ్లు పట్టింది. ఓ నిరుద్యోగి కలల సౌధం గురించి కథ కావడంతో Kamal Hasan ని హీరోగా పెట్టి, తీయడానికి నిర్ణయించారు.
కన్నడ రాజ్ కుమార్ తమ నిర్మాణ సంస్థలో తీయాలనుకున్నా కుదరలేదు. ఎల్వి ప్రసాద్ కి చెబితే, డైలాగులు లేకుండానా అని వెనకడుగు వేశారు. అయితే కన్నడ సినిమా సమయంలో పరిచయమైన శృంగార నాగరాజు ఈ సినిమాలో భాగస్వామ్యం కోసం ముందుకొచ్చాడు. అలా కన్నడంలో పుష్పక విమానం స్టార్ట్ కి రంగం సిద్ధం.
మొదట్లో నీలం కొఠారి హీరోయిన్ అనుకుంటే ఆమె పెట్టిన షరతులు తట్టుకోలేక మాధురి దీక్షిత్ ని సంప్రదిస్తే, నో చెప్పేయడంతో విషయం తెల్సి శ్రీదేవి నటిస్తానని చెప్పింది. అయితే ముంబయి సినీ పరిశ్రమలో సమ్మె వలన కాల్ షీట్స్ ఆరు నెలలు ఆలస్యం కావడంతో ఈలోగా సింగీతం ని ఇండియన్ ఎక్స్ ప్రెస్ వాళ్ళు సన్మానించిన సందర్భంలో యాంకర్ గా వ్యవహరించిన అమలను చూసి, అందరూ వద్దన్నా సరే, హీరోయిన్ గా సెలెక్ట్ చేసారు.
విలన్ గా అమ్రిష్ పురిని అనుకున్నా, కమల్ ఇంట్లో టినూ ఆనంద్ ఫోటో చూసి, ఆయన్ని సెలక్ట్ చేసారు. హోటల్ యజమానిగా గుమ్మడిని అనుకుని, బట్టలు కూడా కుట్టించేసాడు. అయితే చివరి క్షణంలో కన్నడ నటుడు లోక్ నాధ్ ని సెలెక్ట్ చేసారు. మెజీషియన్ రోల్ కోసం పిసి సర్కార్ ని అడిగితె, ఖాళీలేకపోవడంతో రమేష్ అనే అతడిని తీసుకుని ముసలి గెటప్ తెచ్చారు.
అమలను కత్తిపై పాడుకోబెట్టే మెజీషియన్ సీన్ కోసం రెండురోజులు ప్రాక్టీస్. ఇక విలన్ ని చంపడానికి ఐస్ నైఫ్ తయారుచేసారు. 8వేల అడుగుల సినిమా అనుకుని, 16వేలకు చేరింది. అందులో 4వేల అడుగులు ట్రిమ్ చేసారు. మొదట్లో అద్వైత టైటిల్ అనుకుంటే, బెంగుళూరులో 24సీట్ల విమానం పుష్పక్ గుర్తొచ్చింది. పురాణాల్లో కూడా పుష్పక విమానం పేరు వస్తుంది. అందుకే ఆపేరు పెట్టారు.
ఇక సెన్సార్ కి పంపగా, మాటల్లేవని చేయడానికి వీల్లేదనడంతో రేడియోలో ఒకచోట తెలుగు పాట ఇంకోచోట కన్నడ పాట వచ్చేలా చేసి సెన్సార్ చేయించారు. ప్రియుడితో కలిసి తాగుబోతు భర్తను చంపే ప్రయత్నం చేస్తుంది. అందుకోసం పురమాయిస్తుంది. అయితే నిరుద్యోగి కమల్ అతడి భర్త అనుకుని అతడిని చంపే ప్రయత్నం చేస్తాడు. మొత్తానికి కమల్ నటన హావభావాలు అద్భుతం. మూకీ సినిమా కనుక డబ్బింగ్ బాధ లేదు.
దాంతో తెలుగు,కన్నడం,హిందీలలో విడుదల చేసారు. తెలుగులో స్రవంతి రవికిశోర్ డబ్బింగ్ హక్కులు పొందాడు. మంచి ఆదరణతో డబ్బులు వచ్చాయి. నేషనల్ అవార్డు వచ్చింది. రాజ్ కపూర్, శేఖర్ కపూర్, శివసేన అధినేత బాల్ థాకరే ఇలా అందరూ మెచ్చుకున్నారు. సినిమా పరిశ్రమకు ఓ కొత్త వ్యాపారం తెచ్చిన ఘనత సింగీతం శ్రీనివాసరావు కి దక్కుతుంది. డబ్బింగ్ ఖర్చు లేకుండా అన్నిభాషల్లో రిలీజ్ చేయొచ్చని చూపించారు.

